సీఎంకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది, అందుకే సింగపూర్ స్టోరీ చెప్పారు, మాజీ సీఎం !
బెంగళూరు/మంగళూరు/సింగపూర్: కాంగ్రెస్ పార్టీలో అన్నీ వ్యవహారాలు సరిగ్గా లేవని మొదటి నుంచీ తేలిపోయిందని, అందుకే ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారని కర్ణాటకలో మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. సొంత పార్టీ నాయకుల ప్రకటనతో కర్ణాటక ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని నియంత్రించేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సింగపూర్ వ్యూహాన్ని చెప్పారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
మంగళవారం మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే విబేధాలు మొదలైనాయని, ఆ పార్టీలో వర్గపోరు ప్రారంభం అయ్యిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజు నుంచే ఆ పార్టీలో సఖ్యతలేదని స్పష్టం అవుతోంది మాజీ సీఎం బవరాజో బోమ్మయ్ అన్నారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు బీకే. హరిప్రసాద్ ప్రకటన నష్టం నియంత్రణ కోసం సింగపూర్ వ్యూహం గురించి మాట్లాడారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. డీకే శివకుమార్ ఇప్పుడు తన వ్యూహం గురించి మాట్లాడుతున్నారు. వీరిలో సఖ్యతలేదనే విషయాన్ని ఇది డీకే శివకుమార్ మాటలు చెబుతున్నాయని, ఈ ప్రభుత్వం అస్థిరత గురించి ఆలోచించడం లేదని బీజేపీ అంటోంది.

డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తేడా ఉన్న మాట వాస్తవమే. డీకే శివకుమార్ కర్ణాటక ప్రభుత్వం గురించి రెండుసార్లు బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారని, ఈ విషయంలో సీఎం సిద్దరామయ్యల మధ్య చాలా విబేధాలు ఉన్నాయని, ఇద్దరి మద్య సఖ్యత లేకపోవడంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, జైన ముని హత్య నుంచి కర్ణాటకలో ఇప్పటికే నిత్యం హత్యలు జరుగుతున్నాయని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.
బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి న్యాయమూర్తులకు బెదిరింపులు వస్తున్నాయని, న్యాయమూర్తులకే రక్షణ లేకపోతే ఇంకెవరికైనా రక్షణ ఎలా ఉంటుంది?. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చిందని, అంతర్గత కలహాలు పెరిగాయని, ఈ ప్రభుత్వ హామీలను అమలు చేయడానికి ఎస్ సీపీ, టీఎస్ పీ నిధులను ఉపయోగిస్తోంది.

వ్యవసాయ శాఖలో రూ. 4, 500 కోట్లు, నీటిపారుదల శాఖలో రూ. 3, 500 కోట్లు నిధులు దారిమళ్లాయని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
ఈ ప్రభుత్వం హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. అభివృద్ధి పనులు చేయకపోవడంతో మూడు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, దీంతో సొంతపార్టీలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ సిద్దరామయ్య ప్రభుత్వం మీద మండిపడ్డారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications