బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

Bay of Bengal: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ దీని తీవ్రత అంచనాలకు మించి పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటోన్న విద్యుత్ కోతలు దీనికి తోడవుతోన్నాయి. ఫలితంగా ఉక్కపోతకు గురి అవుతున్నారు జనం.

4 డిగ్రీలు అధికంగా..

మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్- మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు.

Bay of Bengal Heavy rains are likely to take place over coastal Tamil Nadu and Puducherry

బంగాళాఖాతంలో..

ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల పాటు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

ఎల్లో అలర్ట్..

భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. శనివారం ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.

ఎల్లుండి కూడా..

వీటితో పాటు మరిన్ని జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్ కాశి, రామనాథపురం, విరుధునగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత మార్చి 2వ తదీ వరకూ కొనసాగుతుందని తెలిపింది. పుదుచ్చేరి, కారైకల్ సహా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+