వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bdelloids Rotifiers: 24వేల ఏళ్ల తర్వాత సుప్తావస్థ నుంచి బయటకొచ్చిన జీవి...

|
Google Oneindia TeluguNews

డెల్లాయిడ్ రాటిఫర్స్... బహుశా ఈ భూమిపై ఎంతటి విపరీత వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని జీవించగలిగే సూక్ష్మజీవి. 24 వేల ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ జీవి సుప్త చేతనావస్థ నుంచి మళ్లీ బయటకొచ్చింది. అంతేకాదు,ప్రత్యుత్పత్తి కూడా ప్రారంభించింది. ఈశాన్య సైబీరియాలోని అలజేయా నది తీరంలో రష్యన్ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. అక్కడ దాదాపు 11 అడుగుల మేర తవ్వకాలు జరిపి మంచు నమూనాలు సేకరించగా... అందులో ఇది బయటపడింది. కేవలం మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే ఈ సూక్ష్మజీవికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలవు...

ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలవు...

ఆకలి,తక్కువ ఆక్సిజన్,డీహైడ్రేషన్ వంటి ప్రతికూల పరిస్థితులను సైతం డెల్లాయిడ్ రాటిఫర్స్ ఏళ్ల తరబడి తట్టుకోగలవు. ఒకరకంగా ప్రపచంలోనే అత్యంత విపరీత పరిస్థితులను తట్టుకోగలిగే జీవులు. ఘనీభవించిన స్థితిలో సుప్త చేతనావస్థలోకి జారుకున్నా... వందల,వేల ఏళ్ల తర్వాత ఇవి మళ్లీ చలనంలోకి రాగలవు. తాజాగా అలజేయా నది తీరంలో గుర్తించిన రాటిఫర్‌కు కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించడం ద్వారా దాని వయసు 24 వేల ఏళ్ల సంవత్సరాలుగా గుర్తించారు.

అలైంగికంగానే పునరుత్పత్తి...

అలైంగికంగానే పునరుత్పత్తి...

డెల్లాయిట్ రాటిఫర్స్ సూక్ష్మజీవులే అయినప్పటికీ వీటి శరీరంలో మెదడు,కండరాలు,పునరుత్పత్తి వ్యవస్థ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ఆసక్తికర విషయమేంటంటే... వీటిల్లో కేవలం ఆడ జీవులు మాత్రమే ఉంటాయి. మగ జీవితో సంపర్కం లేకుండా అలైంగికంగా అవి పునరుత్పత్తి జరుపుతాయి. ఆడజీవుల్లో ప్రత్యుత్పత్తికి అవసరమైన అండాలు విడుదలై వాటంతట అవే పిల్లల్ని కంటాయి. ఇవి తేమతో కూడిన నాచుపై,మంచి నీటి చెరువుల్లో సరస్సుల్లో జీవిస్తాయి. ఆర్కిటిక్, ఉష్ణమండల ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లు ఎక్కువగా ఉంటాయి.

మరింత లోతైన పరిశోధనలు...

మరింత లోతైన పరిశోధనలు...

సాధారణంగా 'రాటిఫర్' అంటే చక్రాలు గలది అని అర్థం. లాటిన్ నుంచి ఈ పేరు వచ్చినట్లు చెబుతున్నారు. తాజాగా గుర్తించిన రాటిఫర్ కచ్చిత వయసును నిర్ధారించేందుకు మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందంటున్నారు. అలాగే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇవి తమ కణజాలాన్ని,అవయవాలను ఎలా రక్షించుకోగలుగుతున్నాయి... డీఎన్ఏని ఎలా పునరుద్దరించుకోగలుగుతున్నాయన్నది తెలియాలంటే మరిన్ని పరిశోధనలు జరగాలంటున్నారు. ఏదేమైనా భూమిపై 24 వేల ఏళ్ల పురాతన జీవి ఆనవాళ్లు ఈ అనంత విశ్వంలో ఇంకెన్ని వింతలు దాగున్నాయో అన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి.

English summary
Bdelloids,the microscopic, multicellular creatures have complex anatomies and are one of the planet’s most radiation-resistant animals. They can withstand extreme acidity, starvation, low oxygen and years of dehydration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X