తుపాకీతో కాల్చుకుని మాజీ సీఎం మనవడు ఆత్మహత్య
ఛండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను తాను తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఛండీగఢ్‌లోని తమ నివాసంలో హర్కీరత్ సింగ్ ఆదివారం ఉదయం తనను తాను కాల్చుకున్నాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని సమీపంలోని పీజీమర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ, ప్రాథమిక సమాచారం ప్రకారం అతడు ఏదో అంశం విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తెలిసింది.
కాగా, బియాంత్ సింగ్ స్వగ్రామమైన లూధియానాలోని కోట్లీ గ్రామానికి హర్కీరత్ సింగ్ సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2013లో ఆయన గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అతని సోదరుడు గుర్కీరత్ సింగ్.. ఖన్నా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, వీరి తండ్రి తేజేశ్వర్ సింగ్ గతంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications