'ఆ నలుగురు' మోడీకి చెడ్డపేరు: షా సమన్లు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి ఘటన, పశు మాంసం, ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. దేశంలో అశాంతిని పెంచేలా నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోడీకి బాధను కలిగిస్తున్నాయంటూ, బీజేపీ అధ్యక్షుడు ఆ పార్టీ నేతలకు సమన్లు జారీ చేశారు.

ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, కేంద్ర మంత్రి మహేశ్ శర్మ, ఎంపీ సాక్షి మహారాజ్, యూపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ లకు సమన్లు జారీచేశారు. ఈ ముగ్గురు నేతలను ఆదివారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు.

వారి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చివరికి ఆ నలుగురికి సమన్లు జారీ చేశారు. పశుమాంసం మానేస్తేనే ముస్లింలు భారత్‌లో ఉండాలని హర్యానా సీఎం ఖట్టర్, గోవధకు పాల్పడ్డ వారిని ఉరితీయాలని ఎంపీ సాక్షి మాహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Beef row: With BJP under fire, Amit Shah summons leaders over controversial remarks

వీరికి తోడుగా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన దాద్రి ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీరందరినీ ఇకపై వివాదాస్పద కామెంట్లు చేయవద్దని హెచ్చరించారు. ఈ తరహా వ్యాఖ్యలను ప్రధాని మోడీ సహించబోరని అన్నారు.

మీరు చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోడీతో పాటు, మొత్తం పార్టీకే చెడ్డపేరు తెచ్చే విధంగా ఉన్నాయని అన్నారు. ఏదైనా అభిప్రాయం వెల్లడించేటప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని, ఆచి తూచి మాట్లాడాలని హెచ్చరించారు. అయితే అమిత్ షా సమన్లుపై విపక్షాలు మాత్రం విభిన్నంగా స్పందించాయి. 'ఇది మరో డ్రామా' అని కొందరంటే, 'దిద్దుబాటు చర్య' అని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+