మన్మోహన్ సింగ్ సంతకం చేసిన నోట్లు మీ వద్ద ఉన్నాయా?
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశ ప్రజలు కన్నీటి నివాళి అర్పిస్తోన్నారు. ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నారు. ఆయన మృతికి సంతాప సూచకంగా తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు సెలవును ప్రకటించాయి. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, వేడుకలు, ఉత్సవాలను నిర్వహించకూడదని కేంద్రం తెలిపింది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్.

తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని ఒంటిచేత్తో ఒడ్డెక్కించారు. ప్రపంచాన్ని కుదిపేసిన తీవ్ర మాంద్యం పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరలేదంటే దాని ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. బ్యాంకింగ్ వ్యవస్థను ధృడంగా ఉంచగలిగారు మన్మోహన్ సింగ్.
ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఢిల్లీలో ఆయన నివాసంలో పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం గర్వించదగ్గ ప్రధానమంత్రుల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.
రాజకీయాల్లోకి రాకముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పని చేశారు మన్మోహన్ సింగ్. ఆర్బీఐకి 15వ గవర్నర్ ఆయన. 1982 నుంచి 1985 వరకు ఈ స్థానంలో కొనసాగారు. అంతకుముందు ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మరొకరు లేరు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నప్పుడు బ్యాంకింగ్ సెక్టార్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎన్నో సత్ఫలితాలను ఇచ్చాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను పట్టి పీడించనప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం చెక్కు చెదరలేదు. దీనికి కారణం బ్యాంకింగ్ సెక్టార్ అత్యంత బలంగా ఉండటమే. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మానవీయ కోణంలో సంస్కరణలను అమలు చేశారు.
కాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా మన్మోహన్ సింగ్ సంతకం చేసిన కరెన్సీ నోట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రూపాయి మొదలుకుని 100 రూపాయల కరెన్సీ నోటు వరకూ ఆయన సంతకాలు చేశారు. ఒకదాంట్లో గవర్నర్, మరో దాంట్లో ఆర్థిక శాఖ కార్యదర్శి అంటూ డిజిగ్నేషన్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications