వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమిస్తే, లైంగిక సంబంధానికి అంగీకరించినట్లు కాదు: కేరళ హైకోర్టు కీలక తీర్పు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళ ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతడు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది. ఆమె అందుకు ఒప్పుకుందని ఊహించుకోవడం ఎంతమాత్రమూ సరికాదని తెలిపింది.

ఆమెను బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అది కిడ్నాప్ తోపాటు అత్యాచారం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ నారాయణ పిషరది తీర్పు ఇచ్చారు. నిస్సహాయ స్థితిలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె లైంగిక సంబంధంలో పాల్గొంటే అది అంగీకారం కిందికి రాదని, అంగీకారానికి.. లొంగుబాటుకు తేడా ఉందన్నారు.

being in love doesn’t mean consent for sex: Kerala High Court

ప్రేమిస్తున్నంత మాత్రాన ఆమె అన్నింటికీ అంగీకరిస్తున్నట్లుగా భావించకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగలు విక్రయించి మళ్లీ గోవా తీసుకెళ్లాడు. అక్కడ కూడా మరోసారి అత్యాచారం చేశాడు.

వీటన్నింటికీ అంగీకరించకపోతే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె వెళ్లకతప్పలేదు. దీనిపై కేసు నమోదు కాగా, ఆమె ఎక్కడా ప్రతిఘటించలేదని, అంతా అంగీకారంతోనే జరిగిందని నిందితుడు వాదించాడు. దీన్ని అంగీకరించని ట్రయల్ కోర్టు అతనికి అత్యాచారం నేరం కింద శిక్ష విధించింది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా, కింది కోర్టు తీర్పును సమర్థించింది. బాధితురాలి వయసు నిర్ధరణ కాకపోవడంతో పోకో చట్టం కింద విధించిన శిక్షను మాత్రం రద్దు చేసింది.

English summary
being in love doesn’t mean consent for sex: Kerala High Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X