ప్రతిపక్ష నాయకుడు, మొబైల్ టవర్ తెచ్చిన తంటాలు, కర్ణాటక బార్డర్ లో ఏం జరిగిందంటే?
బెంగళూరు: రెండు రాష్ట్రాల మధ్య నిత్వం రెండు వర్గాలకు గొడవలు జరగుతున్నాయి. అయితే అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల మద్య వివాదాలు, గొడవలు, పంచాయితీలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మారినా గత ప్రభుత్వ హయంలో పెత్తనం చెలాంచిన కొందరు నాయకుల మీద ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది.
సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేసే విషయంలో అధికార పార్టీ మద్దతుదారులకు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గొడవలు జరగడంతో పరస్పరడం దాడులు చేసుకున్నారు. కర్ణాటకలోని బెళగావి సిటీలోని భాగ్యనగర్ 9వ క్రాస్ వద్ద సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుకు సంబంధించి రమేష్ పాటిల్ అనే వ్యక్తిపై దాడి చేసిన ఆరోపణలపై తిలకవాడి పోలీసులు ఆదివారం సాయంత్రం బెళగావి సిటీకి చెందిన బీజేపీ కార్పొరేటర్ అభిజిత్ జవాల్కర్ అలియాస్ అభిజిత్ బాయ్ ని అరెస్టు చేశారు.

సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటుకు నిరసనగా ఆ స్థలానికి వెళ్లిన తనపై అబిజిత్ తో పాటు మరికొందరు దాడి చేశారని పాటిల్ అనే వ్యక్తి ఆరోపించారు. చికిత్స నిమిత్తం తనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని పాటిల్ ఆరోపించారు. పాటిల్ ఫిర్యాదు మేరకు బీజేపీ కార్పోరేటర్ అబిజిత్ జవాల్కర్‌ను అరెస్టు చేసినట్లు బెళగావి సిటీ పోలీసు కమిషనర్ ఎస్‌ఎన్.సిద్దరామప్ప సోమవారం మీడియాకు చెప్పారు.
బీజేపీ కార్పోరేటర్ అభిజిత్ జవాల్కర్‌ను అరెస్టు చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ బెళగావిలో బీజేపీ, ఎంఇఎస్ నాయకులు ఆందోళకు దిగారు. బీజేపీ కార్పోరేటర్ అభిజిత్ ను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎంఈఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు బెళగావిలోని తిలకవాడి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ విషయంపై బీజేపీ బెళగావి సిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనిల్ బెనకే మీడియాతో మాట్లాడారు.
బీజేపీ కార్పోరేటర్ అబిజిత్ జవాల్కర్ అరెస్టుతో బెళగావిలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని మరోసారి వెలుగు చూసిందని, దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఈఎస్‌కు తొత్తుగా మారిందని, చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన బీజేపీ కార్పోరేటర్ అభిజిత్ ను అరెస్టు చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications