ఫ్యామిలీ మొత్తం ఫినిష్, ఆంటీ మీద కోపంతో ఎంత పని చేశాడంటే ?, ప్లాన్ చూస్తే షాక్ !
దీపావళి పండుగ రోజు తెల్లవారుజామున కర్ణాకలోని ఉడిపిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసి కర్ణాటక రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేరానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావిలో అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని
ఉడిపిలోని ఓ ఇంట్లోకి చొరబడి కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేసిన నిందితుడు పరారయ్యాడు.
నలుగురిని దారుణంగా హత్య చేసిన నిందితుడి పేరు ప్రవీణ్ చౌగలే అలియాస్ ప్రవీణ్ (35)గా గుర్తించామని పోలీసు అధికారులు అంటున్నారు. గత రెండు రోజులుగా ప్రవీణ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్నాడు. నిందితుడు ప్రవీణ్ బెళగావి మీదుగా మహారాష్ట్రకు, లేదంటే తెలంగాణకు పారిపోవడానకి ప్లాన్ చేశాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.

హంతకుడు ప్రవీణ్ మొబైల్ నెట్ వర్క్ సమాచారంతో పాటు అతని కాల్ డేటా సాంకేతిక వివరాల ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నాలుగు హత్యల అనంతరం బెళగావి నగరంలో పట్టుబడిన నిందితుడు ప్రవీణ్ ను అరెస్టు చేసి ఉడిపికి తీసుకువచ్చామని పోలీసులు తెలిపారు. ఉడిపిలో నలుగురిని హత్య చేసిన తరువాత నిందితుడు ప్రవీణ్ చాకచక్యంగా తప్పించుకుని అక్కడి నుంచి పరారైనాడు.
పోలీసులు నాలుగు హత్యల కేసులో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ లతో గాలించారు. అయితే రాష్ట్రం దాటిపారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడు ప్రవీణ్ ను బెళగావి సరిహద్దులో అరెస్టు చేశారు.
ఉడిపి జిల్లా మల్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిప్తీ నగర్‌లో ఆదివారం హసీనా (46), అఫ్నాన్ (23), అయినజ్ (21), అసిమ్ (12)లను దుండగుడు కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు.

ఒకే ఘటనలో తల్లి, ముగ్గురు పిల్లలు హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి, హత్య వెనుక వివిధ కోణాలను పోలీసులు అనుమానించారు. హంతకుడి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. హత్య నిందితుడు ప్రవీణ్ చౌగలే అలియాస్ ప్రవీణ్ మంగళూరు విమానాశ్రయంలో పనిచేస్తున్నాడు. హసీనా భర్త వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఇద్దరు పిల్లలు బెంగళూరు, మంగళూరులో పనిచేస్తున్నారు.
అయితే దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు సెలవు కావడంతో ఉడిపిలోని తమ ఇంటికి హసీనా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సమయంలో హసీనా ఇంటికి వెళ్లిన ప్రవీణ్ చౌగలే హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మెడ, ఛాతి సహా దొరికిన ప్రతి ఒక్కరినీ కత్తితో పొడిచి చంపాడు. హంతకుడు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందినవాడని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications