బాయ్ ఫ్రెండ్ తల్లిని నగ్నంగా ఊరిగించారు, ప్రేమికులకు పెళ్లి చేసిన పోలీసులు, వైలెంట్ లవ్ స్టోరీ!
కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రేమికుల ఉదంతం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని బెళగావి నగరంలోని సౌత్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమికులు చట్టపరంగా పెళ్లి చేసుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమికులకు ఇప్పుడు పోలీసులు దగ్గర ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో చట్టపరంగా మరోసారి పెళ్లి చేసి వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రెండు నెలల క్రితం బెళగావి జిల్లాలోని కొత్త వంతమూరి గ్రామంలో సమాజం తల దించుకునేలా చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయారనే కారణంతో యువకుడి తల్లిని వివస్త్రను చేసి ఆమెను నగ్నంగా విద్యుత్ స్తంభానికి కట్టేసి మూకమ్ముడిగా దాడి చేశారు. దీనికి సంబంధించి 11 మంది నిందితులను బెళగావి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు అందరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దాడి జరిగిన రోజు అంటే డిసెంబర్ 11, 2023 ప్రేమికులు ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. బెళగావిలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని డిప్యూటీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకోవడానికి అర్జీకూడా సమర్పించారు. ప్రేమికుల వివాహానికి సంబంధించి మహిళలు సాక్షులుగా సంతకాలు కూడా చేశారని పోలీసులు చెబుతున్నారు.
వంతమూరి గ్రామానికి చెందిన దుండప్ప అశోక్ నాయక్ అలియాస్ అశోక్, అదే గ్రామానికి చెందిన ప్రియాంక ఒకరినొకరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. అయితే ప్రేమికుల పెళ్లిని ప్రియాంక తల్లిదండ్రులు వ్యతిరేకించారు. యువతికి నిశ్చితార్థం ఫిక్స్ కావడంతో పెళ్లి చేసేందుకు ప్రియాంక కుటుంబ సభ్యులు డేక్ కూడా ఫిక్స్ చేశారు. ప్రియాంక పెళ్లి త్వరగా చెయ్యాలని యువతి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
ఇంట్లో పెళ్లి వేడుకకు సన్నాహాలు జరుగుతుండగా ప్రియాంక ఆమె ప్రేమించిన అశోక్ తో డిసెంబర్ 11వ తేదీన రాత్రి ఊరు విడిచి పారిపోయింది. కూతురు ప్రింయాక ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఆవేశంతో వెళ్లి ప్రియుడు అశోక్ ఇంట్లో చొరబడి అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో కోపోంతో ఊగిపోయిన ప్రియాంక కుటుంబ సభ్యులు అశోక్ ఇంటిపై దాడి చేసి రాత్రికి రాత్రే వాళ్ల ఇంటిని ధ్వంసం చేశారు.

ప్రియుడు అశోక్ తల్లి, అమ్మమ్మలపై దాడి చేసి వాళ్లను ఇంటి నుంచి బయటకు లాక్కొని వచ్చారు. అశోక్ తల్లిని వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించి ఆమెను నగ్నంగా చేసి గ్రామంలోని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈ వార్త వైరల్ కావడంతో కోర్టు కూడా సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేసింది. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.
అలాగే ఈ కేసు గురించి బెళగావి అసెంబ్లీ సమావేశంలో వాడివేడిగా చర్చించారు. ఈ కేసును సీరియస్‌గా పరిగణిస్తామని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు బెళగావి జిల్లా పోలీసులు దగ్గర ఉండి ప్రేమికులు ప్రియాంక, అశోక్ ల పెళ్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిపించి వారికి భద్రత కల్పించారు. ప్రియాంక కుటుంబ సభ్యులు చేసిన పనికి అశోక్ కుటుంబ సభ్యులు ఇంకా విచారం వ్యక్తం చేస్తూనేఉన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications