వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు చీపుర్లుతో స్వాగతం, కారుపైకి చెప్పులు, లాఠీచార్జ్ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించిన జనం

చిత్రదుర్గ/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీలో అసమ్మతి తీవ్రస్థాయిలో మొదలైయ్యింది. బళ్లారితో పాటు ఉత్తర కర్ణాటకలో బలమైన నాయకుడిగా పేరు ఉన్న బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వందలాధి మంది ఒక్కసారిగా మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించి ఎదురుతిరగి కారు మీద చెప్పులు విసరడంతో బీజేపీ ఎంపీ శ్రీరాములు ఒక్కసారిగా షాక్ కు గురైనారు.

బీజేపీ అధిష్టానం

బీజేపీ అధిష్టానం

చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు బీజేపీ అధిష్టానం సూచించింది. వాల్మీకీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గం కేటాయించడంలో ఎంపీ శ్రీరాములు ఆ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

శ్రీరాములు భేటీ

శ్రీరాములు భేటీ

శుక్రవారం బళ్లారి ఎంపీ శ్రీరాములు చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలోని నాయకనహెట్టి ప్రాంతంలో ప్రచారం చెయ్యడానికి వెళ్లారు. నాయకనహెట్టిలోని ప్రసిద్ది చెందిన దేవాలయంలో పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు ప్రయత్నించారు.

చీపుర్లు, చెప్పులు

చీపుర్లు, చెప్పులు

మాళకాల్మూరు నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి అనుచరులు, అభిమానులు శ్రీరాములును దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చీపర్లు, చెప్పులు చూపిస్తూ శ్రీరాములు గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

శ్రీరాములు కారు మీద చెప్పులు

శ్రీరాములు కారు మీద చెప్పులు

ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి మద్దతుదారులు వందలాధి మంది మహిళలు ఒక్కసారిగా చీపుర్లు, చెప్పులతో శ్రీరాములుకు వ్యతిరేకంగా ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది సహనం కోల్పోయి శ్రీరాములు కారు మీద చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపుతప్పింది.

దెబ్బకు లాఠీచార్జ్

దెబ్బకు లాఠీచార్జ్

శ్రీరాములు మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఆందోళనకారులను చెదరకొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత ప్రచారం చెయ్యవచ్చని భావించిన బీజేపీ ఎంపీ శ్రీరాములు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

English summary
Bellary BJP MP B.Sriramulu faced protest by S.Thippeswamy supporters in Molakalmuru assembly constituency in Chitradurga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X