జస్టిస్ లోయా మృతి అన్నీ పరిశీలిస్తామన్న సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జడ్జి బీహెచ్ లోయా మృతి కేసులో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముంబై లాయర్ల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది.
జడ్జి లోయా మృతిపై అనుమానాలు ఉన్నాయన్న పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

లోయా మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కూడా తమకు పంపించాలని ఆదేశించింది. బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కూడా తనకు పంపించాలని చెప్పింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ అంశంపై పిల్స్ స్వీకరించవద్దని హైకోర్టులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.
2014లో లోయా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ తర్వాత లోయా కేసును పరిశీలించిన కొత్త జడ్జి.. ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాకు పాత్రలేదని తేల్చారు.
ఇటీవల నలుగురు సీనియర్ లాయర్లు ప్రెస్ మీట్ పెట్టి కలకలం రేపిన విషయం తెలిసిందే. లోయా మృతి కేసును సీనియర్ల బెంచ్‌కు కాకుండా మరో బెంచ్‌కు ఇవ్వడం వల్లే వారు తిరుగుబాటు చేశారు.












Click it and Unblock the Notifications