వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీల మధ్య మాటల యుద్దం,నోరుజారాడు, క్షమాపణ చెప్పాడు.

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం పార్టీల మద్య మాటల తూటాలను పేలుస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతను కించపరిచేలా మాట్లాడిన ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్నాడు. ఆమెకు క్షమాపణ చెప్ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా : పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం రాజకీయపార్టీల మద్య మాటల మంటలు పుట్టిస్తోంది. పెద్ద నగదు నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తోన్న టిఎంసి అధినేత ,బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై బిజెపి నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు.మమతపై ఆ పార్టీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. బెంగాల్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోస్ మమతను కించపర్చేలా వ్యాఖ్యానించారు. చివరకు ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పారు.మరో వైపు బీహర్ ముఖ్యమంత్రి పై మమత చేసిన విమర్శలను ఆ పార్టీ నాయకులు తిప్పికొట్టారు.

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం దేశంలోని రాజకీయ పార్టీ ల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. పెద్ద నగదు నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకించే వారు తమ నిర్ణయానికి అనుకూలంగా. సమర్థించే వారు తమ నిర్ణయానికి అనుకూలంగా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు.

నవంబర్ 8వ, తేది నుండి దేశంలో పెద్ద నగదు నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ కొన్ని పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయితే టిఎంసి అధినేత మమత బెనర్జీ దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు.

కేంద్రం తీసుకొన్న నిర్ణయం పై విపక్షపార్టీలు అధికారంలో ఉన్న ముఖ్యమంతులు తలోదారిలో వెళ్తున్నారు.కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికింందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

 నోరుజారాడు వెనక్కు తీసుకొన్నాడు

నోరుజారాడు వెనక్కు తీసుకొన్నాడు

పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యంగా మోడీ వ్యవహరశైలిని తప్పుబడుతూ ఆందోళనలు చేస్తోన్న బెంగాల్ ముఖ్యమంత్రి టిఎంసి అధినేత మమత బెనర్జీపై బెంగాల్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించాడు. జుట్టుపట్టుకొని అవతల ఈడ్చి పడేసే వాళ్ళమని ఆయన మమతపై నిప్పులు చెరిగారు. అయితే ఈ వ్యాఖ్యలపై టిఎంసి తీవ్రస్థాయిలో మండిపడింది. దరిమిలా ఘోష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్టు ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఎవరిని కించపరిచేందుకు ఉద్దేశించినవి కావన్నారు. అయితే ముఖ్యమంత్రిని అవమానపర్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు.

నితీష్ పై మమత మాటల తూటాలు

నితీష్ పై మమత మాటల తూటాలు


పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ బీహర్ లో నిర్వహించిన ర్యాలీలో పరోక్షంగా బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉద్దేశించి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వెన్నుపోటు దారుడిగా నితీష్ ను ఆమె అభివర్ణించారు.అయితే ఈ వ్యాఖ్యలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతపై జెడి యూ నేతలు కూడ సీరియస్ గానే స్పందించారు. మమత దీదీగానే ఉంటే బాగుంటుంది. కాని, దాదాగా వ్యవహరించాలని అనుకొంటే సరికాదన్నారు జెడియూ నేతలు.

మమత లక్ష్యంగా పార్టీల విమర్శలు

మమత లక్ష్యంగా పార్టీల విమర్శలు

బెంగాల్ ముఖ్యమంత్రి మమత పెద్ద నగదు నోట్ల రద్దును నిరసిస్తూ ఆందోళనలు చేయడాన్ని కొన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడ మమతపై విమర్శలు చేశారు. బెంగాల్ లో చోటుచేసుకొన్న శారదా, నారదా కుంభకోణాల్లో టిఎంసి నాయకులకు, ఆ పార్టికి చెందిన ప్రజా ప్రతినిధులకే పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణాల్లో పోగుచేసుకొన్న డబ్బును ఎలా మార్పిడి చేసుకొనేందుకు అర్థం కాక మమత ఇబ్బందులకు గురై ఆందోళనకు దిగారని మోడీ ఆరోపించారు. ఇవే ఆరోపణలకు సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ చేశారు.

 కేజ్రీవాల్ అండగా మమత పోరాటం

కేజ్రీవాల్ అండగా మమత పోరాటం

పెద్ద నగదు నోట్ల రద్దును డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్నాడు. మమతతో కలిసి ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.వీరిద్దరూ కలిసి ఆందోళనలు చేస్తున్నారు. బిజెపియేతర ముఖ్యమంత్రుల్లో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విపక్షపార్టీలకు చెందిన ముఖ్యమంత్రులంతా ఒకే అభిప్రాయంతో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.

English summary
bjp west bengal president dilip ghosh sorry to cm mamata benarjee. two days back he use abuse language on cm mamata, tmc leaders conedmned this state ment. on tuesday ghosh with draw his statement on mamata, and also said sorry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X