వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ కు ఘోర అవమానం.. వరుసగా రెండోరోజూ గెంటివేత..

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA: Governor Jagdeep Dhankhar shown black flags by Jadavpur University students

జాదవ్ యూనివర్సిటీ(జేయూ)లో మంగళవారం కాన్వకేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు వెళ్లిన వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధనకర్ కు చేదు అనుభవం ఎదుదైంది. వర్సిటీలోకి రానివ్వకుండా విద్యార్థులు, వర్సిటీ స్టాఫ్ ఆయనను గేటు బయటే అడ్డుకున్నారు. తీవ్ర మనస్తాపం చెందిన గవర్నర్ మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు. పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. ఆ రెండు చట్టాలపై క్లారిటీ ఇవ్వాలని గవర్నర్ ను డిమాండ్ చేశారు. సోమవారం కూడా జేయూలో సరిగ్గా ఇలాంటి సీన్లే చోటుచేసుకున్నాయి. నల్లజెండాలతో నిరసన తెలిపిన స్టూడెంట్లు.. గవర్నర్ గోబ్యాక్ నినాదాలు చేయడంతో గవర్నర్ లోనికి వెళ్లకుండానే వెనుదిరిగారు. దీంతో కాన్వకేషన్ ప్రోగ్రామ్ ను మంగళవారానికి వాయిదా పడింది.

ఇలాంటి ఘోరం ఎప్పుడూ చూడలేదు

ఇలాంటి ఘోరం ఎప్పుడూ చూడలేదు

కాన్వొకేషన్ కు వెళ్లనీయకుండా తనను అడ్డుకోవడంపై గవర్నర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరెత్తకుండా పరోక్షంగా తీవ్రస్థాయి విమర్శలు చేశారు. ‘‘చాలా బాధాకరమైన విషయం. వర్సిటీ చాన్సలర్ గానేకాదు గవర్నర్ గానూ చింతిస్తున్నా. స్టూడెంట్లు లోపల కాన్వొకేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.. డిగ్రీలు ప్రదానం చెయ్యాల్సిన నేనేమో గేటు బయటే ఆగిపోయాను.

కొంతమంది వర్సిటీని బందిఖానాగా మార్చేశారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. చట్టాలు చట్టుబండలయ్యాయి. యూనివర్సిటీ మేనేజ్మెంట్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేతులుకట్టుకుని కూర్చున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థపై నిర్బంధం కొనసాగుతున్నది. వైస్ చాన్సలర్ కొందరి చేతుల్లో రిమోట్ కంట్రోలర్ గా మారిపోయారు. నేను చూస్తూ కూర్చోలేను.. బాధ్యులందరిపైనా కఠిన చర్యలు ఉండాల్సిందే''అని గవర్నర్ ఫైరయ్యారు.

ధనపాల్ కాదు ‘పద్మ'పాల్..

ధనపాల్ కాదు ‘పద్మ'పాల్..

సోమవారం నాటి ఘటనలోనూ గవర్నర్ ను వర్సిటీలోకి రానీయకుండా స్టూడెంట్లు అడ్డుకున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయన పేరును పద్మపాల్(కమలం గుర్తు)గా మార్చామని, జాదవ్ పూర్ వర్సిటీకి చాన్సలర్ గా ఉండే అర్హత ఆయనకు లేదని స్టూడెంట్లు ఆరోపించారు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిలో ముగ్గురు స్టూడెంట్లను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

జులై నుంచీ ఇదే తంతూ..

జులై నుంచీ ఇదే తంతూ..

ఈ ఏడాది జులైలో ధనపాల్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా నియమితులైనప్పటి రాష్ట్రంలో ఇదే తంతు నడుస్తోంది. రెండు నెలల కిందట కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై జాదవ్ పూర్ వర్సిటీ స్టూడెంట్లు దాడి చేసినప్పుడు కూడా గవర్నర్ హుటాహుటినా వర్సిటీకి వచ్చి, కేంద్ర మంత్రిని కాపాడారు. గవర్నర్ ధన్ పాల్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పరిపాలన కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం మమత పలుమార్లు బాహాటంగా విమర్శించారు.

English summary
West Bengal Governor Jagdeep Dhankhar leaves after he was blocked by protesting students from entering Jadavpur University in Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X