14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్: ముగ్గురి అరెస్టు

బెంగళూరు: బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు కామాంధులను బెంగళూరులోని జేపీ నగర పోలీసులు అరెస్టు చేశారు. కూరగాయల వ్యాపారం చేస్తున్న అసయ్ (19), వాటర్ క్యాన్ లు సరఫరా చేస్తున్న సంతోష్ (21), ఆటో డ్రైవర్ అజయ్ (20) అనే ముగ్గురిని అరెస్టు చేశారు.

బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జేపీ నగరలో 14 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈమె నాలుగవ తరగతి వరకు విద్యాభ్యాసం చేసి చదువుకు స్వస్తి చెప్పింది. బాలిక అవ్వతో కలిసి నివాసం ఉంటున్నది.

Bengalore Police arrested three persons for gang raping a minor girl

బాలికతో కూరగాయలు విక్రయించే అసయ్ కు పరిచయం ఉంది. అప్పుడుప్పుడు బాలికను పలకరించేవాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బాలిక ఇంటి దగ్గర ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన అసయ్ బాలికకు మాయమాటలు చెప్పి పిలుచుకుని వెళ్లాడు.

సమీపంలో నిర్మాణంలో ఉన్న కట్టడం దగ్గరకు తీసుకు వెళ్లాడు. అదే సమయానికి అజయ్, సంతోష్ అక్కడికి వెళ్లారు. ముగ్గురు బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. బాలిక కనపడలేదని ఆమె అవ్వ గాలించింది. తరువాత ఇంటికి వెళ్లిన బాలిక విషయం చెప్పింది.

తరువాత చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరిక్షలకు తరలించారు. బాలిక తెలిపిన వివరాల ఆదారంగా ముగ్గురు కామాంధులను అరెస్టు చేసి వైద్య పరిక్షలకు తరలించామని సీహెచ్. ప్రతాప్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+