బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: బెంగళూరులో బెంజ్ కారు భీభత్సం, 7 వాహనాలను ఛట్నీ, ప్రాణం, నందితా చౌదరి కారుతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ లో విలాసవంతమైన ఖరీదైన బెంజ్ కార్లకు కొదవలేదు. బెంగళూరు నగరంలో ప్రతిరోజు వందలు, వేల సంఖ్యలో బెంజ్ కార్లు రోడ్ల మీద రయ్ రయ్ అంటూ దూసుకుపోతుంటాయి. ఎప్పటిలాగే నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో మెర్సిడెస్ బెంజ్ కారు వెళ్లింది. ఆ సమయంలో బైక్ ను ఢీకొనింది. బైక్ లో వెలుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో కారు నడుపుతున్న డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించే సమయంలో పక్కనే ఆల్టో కారును ఢీకొనింది. కారును ఢీకొట్టిన తరువాత బెంజ్ కారు అదుపుతప్పి రెండు ఆటోలతో పాటు మొత్తం 7 వాహనాలను ఢీకొనింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసి పోవడం కలకలం రేపింది. ఇంత రచ్చకు కారణం అయిన మెర్సిడెస్ బెంజ్ కారు ఓ లేడీది అని వెలుగు చూసిందని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు.

Illegal affair: భర్త లేడు, నాటుకోడి లేడీతో మేస్త్రీ మస్త్ మజా, చంపేసి శవం పక్కన నిద్రపోయి !Illegal affair: భర్త లేడు, నాటుకోడి లేడీతో మేస్త్రీ మస్త్ మజా, చంపేసి శవం పక్కన నిద్రపోయి !

 ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డు

ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డు

బెంగళూర నగరంలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఏరియాలో వేలాది కార్లు తిరుగుతుంటాయి. బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఏరియాల్లో ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డు కూడా ఒక్కటి. ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డులో ప్రతిరోజు వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. పాత మద్రాసు రోడ్డు, పాత ఎయిర్ పోర్టు రోడ్డు, దోమ్మలూరు, కోరమంగళ, సిల్క్ బోర్డు జంక్షన్ కు సంచరించే వాహనాలు ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డు మీదుగా వెళ్లి వస్తుంటాయి.

 మెర్సిడెస్ బెంజ్ కారు దెబ్బతో షాక్

మెర్సిడెస్ బెంజ్ కారు దెబ్బతో షాక్

మంగళవారం ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్డులో మెర్సిడెస్ బెంజ్ కారు అతివేగంగా దూసుకువెళ్లింది. ఆ సమయంలో రోడ్డు మీద వెలుతున్న ఓ బైక్ ను బెంజ్ కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్ లో వెలుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో కారు నడుపుతున్న డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించే సమయంలో పక్కనే ఆల్టో కారును ఢీకొనింది.

 వరుసగా 7 వాహనాలను ఢీకొట్టిన కారు

వరుసగా 7 వాహనాలను ఢీకొట్టిన కారు

కారును ఢీకొట్టిన తరువాత బెంజ్ కారు అదుపుతప్పి రెండు ఆటోలతో పాటు మొత్తం 7 వాహనాలను ఢీకొనింది. తరువాత బెంజ్ కారు కూడా దెబ్బ తినడంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి చాకచక్యంగా కిందకు దిగేసి స్థానిక ప్రజల్లో కలిసిపోయారు. ఈ ప్రమాదంలో ఆల్టో కారు నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని బెంగళూరు ట్రాఫిక్ విభాగం ఈస్ట్ జోన్ డీసీపీ శాంత్ రాజ్ స్థానిక మీడియాకు చెప్పారు.

Recommended Video

Sanjay Bangar named head coach of Royal Challengers Bangalore
 కారు నందితా చౌదరిది

కారు నందితా చౌదరిది

ఇందిరానగర్ లో 7 వాహనాలు దెబ్బ తినడాకి కారణం అయిన మెర్సిడెస్ బెంజ్ కారు నందితా చౌదరి అనే మహిళదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాలను రోడ్డు మీద నుంచి తప్పించి వాహన సంచరానికి ఏర్పాట్లు చేశారు. బెంజ్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణం అయిన మెర్సిడెస్ బెంజ్ కారును నందితా చౌదరి నడుపుతున్నారా ? డ్రైవర్ నడుపుతున్నాడా ? అనే విషయం గురించి ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Bengaluru: A speeding Mercedes car crashed into a number of vehicles , killing one in Indira Nagar in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X