ఎంత మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంటే ?, సీఎం, డీసీఎం ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే రెండు విడతల్లో మంత్రి వర్గం ఏర్పాటు చేసిన సీఎం సిద్దరామయ్య ఇప్పుడు పరిపాలన మీద ఎక్కువ శ్రద్ద పెట్టారు. అయితే సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోపాటు కర్ణాటకలో క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న 24 మంది మంత్రులు ఉన్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్స్ (ఏడీఆర్) నివేదికల ప్రకారం కర్ణాటకలో క్రిమినల్ కేసులు ఉన్న మంత్రులు, కోటీశ్వరులైన మంత్రుల వివరాలు బయటకు వచ్చాయి. అయితే బెంగళూరు చెందిన విద్యుత్ శాఖా మంత్రి జార్జ్ అఫిడవిట్ లో సరైన వివరాలు లేకపోవడంతో ఆయన గురించి పూర్తి సమాచారం చిక్కలేదని ఏడీఆర్ తెలిపింది.

సీఎం సిద్దరామయ్య ప్రభుత్వంలో 34 మంది మంత్రులు ఉన్నారు. అందులో 32 మంది మంత్రుల వివరాలు బయటకు వచ్చాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రభుత్వంలోని 75 శాతం మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. కర్ణాటకలోని మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుుడు ఎన్ఎస్. బోస్ రాజు వివరాలు కూడా చిక్కలేదని ఏడీఆర్ నివేదిక తెలిపింది.
ఏడు మంది మంత్రులు మీద ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు. అప్పటి మంత్రి బళ్లారి శ్రీరాములు మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన బి, నాగేంద్ర మీద ఏకంగా 42 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే వివకుమార్ మీద 19 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. కర్ణాటకలోని 32 మంత్రులు కోటీశ్వరులు అని, మంత్రుల సరాసరి ఆస్తి విలువ రూ. 119. 06 కోట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఆస్తి రూ. 1, 413 కోట్లు అని ఏడీఆర్ నివేదిక తెలిపింది. కర్ణాటక ఎక్స్ జ్ శాఖా మంత్రి ఆర్.బి. తిమ్మాపుర ఆస్తి రూ. 58. 56 లక్షలు అని ఏడీఆర్ నివేదిక తెలిపింది.












Click it and Unblock the Notifications