12 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి, ఏం చెప్పారంటే !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలైనాయి. రెండు రోజుల పాటు విధానసభలో కొత్తగా ఎమ్మెల్యేలతో తాత్కాలిక స్పీకర్ ఆర్.వీ. దేశ్ పాండే ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మరోరోజు అసెంబ్లీలో చర్చ ఉంటుంది. సోమవారం కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులోని విధాన సౌధలో అడుగుపెట్టి అందరిని ఆకర్షించారు.
నవ్వుతూ అసెంబ్లీలో అడుగుపెట్టిన గాలి జనార్దర్ రెడ్డి కొంత మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తరువాత అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి 12 ఏళ్ల తరువాత తాను అసెంబ్లీలో అడుగుపెట్టానని, ఈ రోజు కోసం తాను చాలాకాలం నుంచి ఎదురు చూశానని, ఇన్నేళ్ల తరువాత తన ఆశ నెరవేరిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

కొన్ని కాన్ని కారణాల వలన తాను బీజేపీకి దూరం అయ్యానని గాలి జనార్దర్ రెడ్డి అన్నారు. కల్యాణ కర్ణాటక రాజ్య ప్రగతి పార్టీ ఏర్పాటు చేసిన తాను గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యానని, తన మీద నమ్మకం పెట్టుకుని తనకు ఓటు వేసిన గంగావతి ప్రజలకు తాను రుణపడి ఉంటానని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
తనతో పాటు కేఆర్ పీపీ నుంచి పోటీ చేసిన నాయకులను స్థానిక ప్రజలు ఆధరించారని, అయితే ఇప్పుడు తాను ఒక్కడే అసెంబ్లీలో అడుగుపెడుతున్నానని, వచ్చే ఎన్నికల్లో చాలా నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని అసెంబ్లీలో అడుగుపెడుతామని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తాను నడుచుకునే పద్దతినిబట్టి తన పార్టీ భవిష్యత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజల నుంచి ఇంకా మద్దతు ఎక్కువ అవుతుందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు అసెంబ్లీలో ప్రభుత్వానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని గంగావతి నియోజక వర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
తన అవసరం ఎవరికుందో వారికి కచ్చితంగా తన మద్దతు ఉంటుందని పరోక్షంగా బీజేపీకి ఝలక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకముందే గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీతో తాను తెగతెంపులు చేసుకున్నానని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దర్ రెడ్డి పరోక్షంగా చెప్పారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications