Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావళ్ల కాదు భయ్యా.. బెంగళూరులో బతకలేం..!

బెంగళూరు ప్రజలకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ర్యాపిడో, ఉబర్, ఓలా.. తదితర బైక్ ట్యాక్సీలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా ఆ నగరంలో ఆటో ఛార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఆఫ్ బెంగళూరు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ధరలు బెంగళూరు బ్రుహత్ బెంగళూరు నగర పాలిక పరిధిలోకి వర్తిస్తాయని పేర్కొంది.

బెంగళూరు ప్రస్తుతం దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటి. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఐటీ, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులతో ఉరుకులు పరుగులుగా ఉంటుంది ఇక్కడి లైఫ్. అయితే ఈ మధ్య ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్ ట్యాక్సీలు లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ర్యాపిడో, ఉబర్ లు వాడుతుంటారు. అయితే జూన్ 16 నుంచి కర్ణాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు నిలిచిపోయాయి. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.

అంతేకాక మరోసారి బెంగళూరు వాసులపై మరో పిడుగు పడింది. తాజాగా ఆ నగరంలో ఆటో ఛార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఆఫ్ బెంగళూరు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ధరలు బెంగళూరు బ్రుహత్ బెంగళూరు నగర పాలిక పరిధిలోకి వర్తిస్తాయని పేర్కొంది.

Bengaluru Auto Fares Hiked by Siddaramaiah Govt Effective August 1

పెంచిన ధరల ప్రకారం మొదటి 2 కిలోమీటర్లకు ఉన్న రూ. 30 ధరను రూ. 36 కు పెంచారు. అంతేకాక 2 కిలోమీటర్ల తర్వాత ఒక్కో కిలోమీటర్ కు రూ. 18 రూపాయలు చెల్లించాలి. ఇక రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ ఛార్జీలు అమలవుతాయి. నైట్ ఛార్జీలు డే టైమ్ తో పోల్చితే 1.5 రెట్లు అధికంగా ఉంటాయి. ఇక ఆటో మీటర్లను రీ- వెరిఫై చేసి స్టాంప్ వేస్తారు. అక్టోబరు 31 లోపు కొత్త ధరలను మీటర్ పై డిస్ ప్లే చేయాల్సి ఉంటుంది.

అంతేకాక వెయింటింగ్ ఛార్జీలను సైతం పెంచింది. మొదటి 10 నిమిషాలు వెయింటింగ్ ఛార్జి లేదు. ఆ తర్వాత ప్రతి 15 నిమిషాలకు రూ. 10 చొప్పున వెయింటింగ్ ఛార్జీ ఉంటుంది. లగేజీ విషయానికి వస్తే 20 కిలోల వరకూ ఎలాంటి ఛార్జీ ఉండదు. ఆ తర్వాత ఒక్కో కేజీ లగేజీ కు రూ. 10 అదనంగా వసూలు చేస్తారు. ఇక లగేజీ 50 కేజీల కంటే అధికంగా ఉండకూడదని రూల్స్ పెట్టింది.

ఆటో ధరల రేట్లు పెంచాలని 2021 నుంచి ఆటో డ్రైవర్ సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఆటో ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+