వింత: బిట్‌కాయిన్ల రూపంలో గిఫ్ట్స్ తీసుకొన్న టెక్కీ జంట, వెడ్డింగ్ కార్డుపై సూచనలు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు:పెళ్ళి జీవితంలో మరిచిపోకుండా గుర్గుండేలా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. కానీ, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన టెక్కీల జంట తమ పెళ్ళికి బహుమతును బిట్‌కాయిన్ల రూపంలో ఇవ్వాలని కోరారు. ఈ రకంగా తమ వివాహన్ని గుర్తుంచుకొనేలా ఆ జంట నిలిచిపోయారు.

బెంగుళూరుకు చెందిన టెక్కీలు ప్రశాంత్, నీతిలు తమ పెళ్ళికి బహుమతులు ఇచ్చే అతిథులు బిట్ కాయిన్ల రూపంలోనే ఇవ్వాలని వివాహ ఆహ్వన పత్రికలో కోరారు. ఈ మేరకు బిట్ కాయిన్ల ద్వారా బహుమతులను చెల్లించేలా వెడ్డింగ్ కార్డులోనే ఓ క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు.

బిట్‌కాయిన్: రూ.10 లక్షలు, బిట్ కాయిన్ సృష్టికర్త ఎవరు, బ్యాంకుల ఆందోళన

Bengaluru couple seeks bitcoins as wedding gift

వెడ్డింగ్ కార్డు ద్వారా ఉన్న కోడ్ ద్వారా జెబ్ పే కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే ఈ పద్దతి ద్వారా ఎలా బహుమతులు అందించాలనే విషయమై వెడ్డింగ్ కార్డు వెనుక సూచనలను కూడ ముద్రించారు. ఈ వివాహనికి హజరైన అతిథుల్లో ఎక్కువ మంది బిట్ కాయిన్ల రూపంలోనే ఈ జంటకు బహుమతులను ఇచ్చారు.

తమ వివాహనికి వచ్చేవారిలో ఎక్కువ టెక్కీలు, వ్యాపారులు బిట్ కాయిన్ పై అవగాహపన ఉన్నవారే ఉన్నారని ఆ జంట చెబుతోంది. తాము కోరుకొన్నట్టుగానే బిట్ కాయిన్ రూపంలోనే అతిథులు గిప్ట్‌లు ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Startup entrepreneurs Niti Shree and Prashant Sharma from Bengaluru have decided to accept bitcoins as their wedding gifts, perhaps for the very first time in India, and have vowed to use the cryptocurrency for the education and uplift of underprivileged kids and other CSR activities.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి