మద్యం మత్తులో డాక్టర్ కారు భీభత్సం: ఒకరు మృతి
బెంగుళూరు: వైద్యం చేసి మనుషుల ప్రాణాలు నిలబెట్టాల్సిన ఓ వైద్యుడు పీకలదాకా తాగేసి రోడ్డుపై అడ్డగోలుగా వాహనం నడిపి ఓ స్కూటరిస్ట్ (52)తో పాటు మరో నలుగురిని ఢీ కొట్టాడు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో స్కూటరిస్ట్ అక్కడికక్కడే చనిపోగా, మిగిలిన నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు. పోలీసులు కథనం ప్రకారం బెంగుళూరులోని బనశంకరి థర్డ్ స్టేజ్‌లోని ఐటీఐ కాలనీకి చెందిన డాక్టర్ ఎన్ఎస్ శంకర్ అనే వ్యక్తికి జయనగర్ థర్డ్ బ్లాక్‌లో ఆర్దోపెడిక్ క్లినిక్ ఉంది.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నాం అతడు పీకలదాగా తాగేసి తన మెర్సిడెస్ సీ200 కారుని వేగంగా నడిపాడు. దీంతో అదుపు తప్పిన కారు అటుగా వస్తున్న స్కూటరిస్ట్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఓ రేకుల ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బైరసంద్ర ప్రధాని రహదారిలో చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో వైద్యుడి కారులో తన ఇంట్లో పనిచేసే సరిత అనే మహిళ, ఆమె రెండేళ్ల కూతురు ఉన్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెంజ్ కారు కావడంతో డాక్టర్ స్వల్పంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న విల్సన్ గార్డెన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తాగి వాహనం నడిపినా, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడిన డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications