పార్టీ లేదా పుష్పా, ఎర్రచందనం చెట్లు కటింగ్, లైవ్ లో ఎన్ కౌంటర్ తో ది ఎండ్ !
బెంగళూరు: ఎర్ర చందనం, శ్రీగంధం చెక్కలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా ఉంటుందో అనే కథతో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పుష్పా సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది.
పుష్పా సినిమాలో హీరో, విలన్, పోలీసులు ఒకరి మీద ఒకరు ఎలా ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటారో మనం చేశాము. ఎర్రచందనం పట్టుకోవాలని పోలీసులు, అదే ఎర్ర చందనం స్మగ్లింగ్ చెయ్యాలని అల్లు అర్జున్ తదితరులు వేసే స్కెచ్ లు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి, ఇప్పుడు బెంగళూరు నగరంలో పుష్పా సినిమా లాంటి స్టోరీ రిపీట్ అయ్యింది.

బెంగళూు నగర శివార్లలోని బన్నేరుఘట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్కెరెలోని వీవర్స్ కాలనీలో ఫారెస్ట్ గార్డులు జరిపిన కాల్పుల్లో ఒక స్మగ్లర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే సమయంలో మరో నిందితుడు పరారైనాడు. అడవిలోకి చొరబడి ఎర్ర చందనం చెట్టును నరకడానికి వచ్చిన కోలారు జిల్లా మలూరుకు చెందిన తిమ్మరాయప్పపై అటవి శాఖ అధికారులు కాల్పులు జరిపారు.
ఫారెస్ట్ గార్డు వినయ్ కుమార్ జరిపిన కాల్పుల్లో తిమ్మరాయప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున 3. 30 గంటల ప్రాంతంలో చెట్లు నరికే శబ్ధం అటవీశాఖ సిబ్బందికి వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే ఎర్ర చందనం చెట్లునరికివేస్తున్నాని వెలుగు చూసింది. చెట్లను నరికివేసే వారు వెంటనే లొంగిపోవాలని ఫారెస్ట్‌గార్డులు నిందితులకు సూచించారు.

అనంతరం కేసు నమోదు చేశారు. తలదాచుకున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు, అటవి శాఖ అధికారులు తెలిపారు. ఎర్రచందనం చెట్టు దొంగపై కాల్పుల ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బాలదండి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని, మిగతా నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications