Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!!

బెంగళూరు: నమ్మిన బంధమే యమపాశమైంది. ఒకే ఇంట్లో ఉంటూ కళ్లు గప్పిన వావివరుసలు లేని వైనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరులోని బన్నేరుగట్ట ప్రాంతంలో జరిగిన ఈ ఘోర హత్యోదంతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగింది?

బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి భైరప్పనహళ్లిలో కుక్కల పెంపక కేంద్రం నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్ తన బావమరిది రంజిత్ (24)తో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. రంజిత్ స్వయానా శ్రీనివాస్ భార్య తమ్ముడు. వీరిద్దరి మధ్య బంధుత్వమే కాదు, మంచి స్నేహం కూడా ఉండేది. అయితే, ఈ స్నేహం వెనుక ఒక నల్లని నీడ కమ్ముకుంటుందని శ్రీనివాస్ ఊహించలేదు.

bengaluru-horror-man-assassinates-brother-in-law-over-illicit-affair-surrenders-with-body-to-police

చెల్లెలితో అక్రమ సంబంధం..

శ్రీనివాస్‌కు వివాహమైన ఒక చెల్లెలు ఉంది. దురదృష్టవశాత్తూ, రంజిత్ తన బావ చెల్లెలితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ షాక్‌కు గురయ్యాడు. "ఇది ధర్మం కాదు.. వావివరుసలు చూసుకో.. మన కుటుంబాల పరువు తీయకు" అంటూ రంజిత్‌ను పలుమార్లు హెచ్చరించాడు. పెద్ద మనుషులతో చెప్పించినా, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రంజిత్ తీరు మారలేదు. సరికదా, తన ప్రవర్తనతో శ్రీనివాస్‌ను మరింత రెచ్చగొట్టసాగాడు.

ఇనుప రాడ్‌తో అటాక్

రంజిత్ ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీనివాస్, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. రంజిత్‌ను చర్చల సాకుతో బన్నేరగట్ట సమీపంలోని బిల్వరదహళ్లి అనే నిర్మానుష్య ప్రాంతానికి పిలిచాడు. అక్కడ మళ్ళీ అదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో, శ్రీనివాస్ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో రంజిత్ తలపై బలంగా బాదాడు. ఒక్క దెబ్బకే రంజిత్ రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

పోలీస్ స్టేషన్‌లో 'లైవ్' సరెండర్
హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ పారిపోలేదు.రంజిత్ మృతదేహాన్ని తన వాహనంలో వేసుకుని నేరుగా బన్నేర్‌గట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.స్టేషన్ ముందు కారు ఆపి,లోపలికి వెళ్లి "సార్.. నా బావమరిదిని నేనే చంపేశాను,బాడీ కారులో ఉంది..నన్ను అరెస్ట్ చేయండి"అని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

పోలీసుల దర్యాప్తు:
శ్రీనివాస్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వెంటనే వాహనం తనిఖీ చేసి రంజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.శ్రీనివాస్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ హత్యలో శ్రీనివాస్‌కు ఇంకెవరైనా సహకరించారా?లేక ఆవేశంలో ఒంటరిగానే చేశాడా?అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నగరాల్లో పెరుగుతున్న వివాహేతర సంబంధాలు ఇలాంటి ఘోరమైన నేరాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే ఇక్కడ బాధితులుగా మారుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.బంధాల మీద గౌరవం లేని చోట ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటాయి. క్షణికావేశం ఒకరి ప్రాణం తీస్తే, మరొకరిని జైలు పాలు చేసింది. పరువు కోసం ప్రాణాలు తీయడం పరిష్కారం కాదని, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కౌన్సెలింగ్ లేదా చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడం ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+