విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!
విశాఖపట్నం (Visakhapatnam)నుంచి బెంగళూరు (bengaluru) వెళ్లే ప్రయాణికులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ఇప్పటికే నడుపుతున్న రెండు రైళ్లకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ కీలక మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు, మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం-ఎస్ఎంవీబీ బెంగళూరు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తున్న రెండు ప్రత్యేక రైళ్లకు పొడిగింపు ఇస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో విశాఖపట్నం నుంచి ఎస్ఎంవీబీ బెంగళూరు స్టేషన్ కు ప్రతీ ఆదివారం ప్రయాణించే ప్రత్యేక రైలు నంబర్ 08581తో పాటు ఎస్ఎంవీబీ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ప్రతీ సోమవారం ప్రయాణించే ప్రత్యే రైలు నంబర్ 08582 ఉన్నాయి. ఇందులో విశాఖ-ఎస్ఎంవీబీ బెంగళూరు రైలును ఏప్రిల్ 5 నుంచి మే 3వ తేదీ వరకూ పొడిగించారు. అలాగే ఎస్ఎంవీబీ బెంగళూరు నుంచి విశాఖ వెళ్లే రైలును ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకూ పొడిగించారు.

ఈ రెండు రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, బంగారపేటలో హాల్ట్ లు ఉన్నాయి. విశాఖ నుంచి ఆదివాయం మధ్యాహ్నం 3.20కు బయలుదేరే ప్రత్యేక రైలు ఎస్ఎంవీబీ బెంగళూరు స్టేషన్ కు సోమవారం మధ్యాహ్నం 1.50కి చేరుకుంటుంది. అలాగే ఎస్ఎంవీబీ బెంగళూరు నుంచి సోమవారం మధ్యాహ్నం 3.50కు బయలుదేరే ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 1.30కి విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రతీ రైలులోనూ 4 జనరల్, 6 స్లీపర్, 4 థర్డ్ ఏసీ ఎకానమీ, ఒక సెకండ్ ఏసీ కోచ్ లు ఉంటాయి.












Click it and Unblock the Notifications