Bengaluru: ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఈద్గా మైదానంలో గణేశుడి విగ్రహాం ఏర్పాటు చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈద్గా మైదానంలో, చామరాజపేట క్రీడా మైదానంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు సూచించింది. వినాయకుడి విగ్రహాల ఏర్పాటు నిర్ణయిత సమయంలోపు ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.
అయితే వినాయకుడి విగ్రహం నిర్ణయిత గడువులోపు ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. బెంగళూరు నగరంలోని చామరాజపేట క్రీడామైదానం రెవన్యూ శాఖకు చెందినదని ఇప్పటికే బీబీఎంపీ అధికారులు కోర్టుకు చెప్పారు. ఇటీవల చామరాజపేట క్రీడా మైదానాన్ని బీబీఎంపీ రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చామరాజపేట క్రీడా మైదానంలో ఈనెల 15వ తేదీన 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది ల భారీ పోలీసు బందోబస్తు మద్య నిర్వహించారు. చామరాజపేట క్రీడామైదానం రెవెన్యూ శాఖ అధికారులకు చెందడంతో ఆ స్థలాన్ని ధార్మిక కార్యకలాపాలకు ఇచ్చే హక్కు రెవెన్యూ శాఖ అధికారులకు ఉందని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే చామరాజపేలో అధికారులు సూచించిన గడువులోపు వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉందని కర్ణాటక హైకోర్టు సూచించింది. అయితే చామరాజపేట క్రీడామైదానంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని పోలీసు అధికారులు నిర్ణయించారని తెలిసింది.