బెంగళూరులో ఓవర్ యాక్షన్ చేసేదాంట్లో వీళ్లు ఫస్ట్, కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా ?, పోయేకాలం !
బెంగుళూరులోని నమ్మన మెట్రో రైలు సిబ్బంది (బెంగళూరు మెట్రో రైలు) ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతకుముందు మెట్రో సిబ్బంది ఓ రైతుకు బట్టలు సరిగా లేవని ఆయన్ను మెట్రో రైలు ఎక్కనివ్వకుండా అవమానించారు. ఇప్పుడు మనరోసారి బెంగళూరు నమ్మ మెట్రో రైలు సిబ్బంది ఓవర్ యాక్షన్ చేసి సాటి ప్రయాణికుల దగ్గర చివాట్లు తింటున్నారు.
బెంగళూరు నమ్మ మెట్రో రైలులో ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని బీఎంఆర్ సీఎల్ అధికారునుల ప్రజలు, మెట్రో రైలు ప్రయాణికులు నిలదీస్తున్నారు. బెంగళూరు మెట్రో రైలులో రైతుకు జరిగిన అవమానం లాంటి ఘటనే మరోసారి జరగడం సర్వత్రా దుమారం రేపుతోంది. బట్టలు సరిగా లేవని, చొక్కా బటన్ లు సరిగా వేసుకోలేదని, బట్టలు క్లీన్‌గా లేవని ఓ కార్మికుడిని బెంగళూరు మెట్రో సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు.

కార్మికుడిని అవమానించిన మెట్రో సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సాటి ప్రయాణికులు, బెంగళూరు ప్రజలు డిమాండ్ చేశారు. ఇటీవల రాజాజీనగర్ మెట్రో స్టేషన్ లో ఓ అన్నదాతను మెట్రో సిబ్బంది అడ్డుకుని ఆయన్ను అవమానించారు. బట్టలు శుభ్రంగా లేవని, నువ్వు ఇలాంటి ఏసీ రైలులో ఎలా ప్రయాణిస్తావని, మెట్రో రైలులో ప్రయాణించడానికి ఎగరేసుకుంటా మీ ఊరి నుంచి వచ్చేశావా ? అంటూ ఆ రైతును మెట్రో లోపలికి రానివ్వకుండా సిబ్బంది అవమానించారు.
అన్నదానతు మెట్రో రైలు సిబ్బంది అడ్డుకుని అవమానించిన సమయంలో ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన ప్రజలు బీఎంఆర్‌సీఎల్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది మరో కార్మికుడిని కూడా అవమానించడం కలకలం రేపింది. బెంగళూరు మెట్రో సిబ్బంది ఈ చర్యపై ప్రజలు మండిపడుతున్నారు.
Location Doddakallasandra metro. One more incident of cloth/attire related incident happened in front of me just now. A labourer was stopped & told to stitch up his top two buttons…
— Old_Saffron(ಮೋದಿಯ ಪರಿವಾರ/Modi’s Family) (@TotagiR) April 7, 2024
When did Namma metro became like this!!? @OfficialBMRCL @Tejasvi_Surya pic.twitter.com/4hB8Z6Q2gT
సాధారణంగా ప్రజలు, ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తారు. ఆఫీసులు, కంపెనీల్లో పని ముగించుకుని వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవడానికి ఉద్యోగులు మెట్రో రైలుపైనే ఆధారపడుతున్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే వారు కూడా బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అంటే కార్మికులు, రైతులు, పేదలు డబ్బులు చెల్లించకుండానే మెట్రో ఎక్కుతున్నారా?, చక్కని బట్టలు వేసుకున్నవారే మెట్రోలో ప్రయాణించాలి ? అనే రూల్ ఏమైనా ఉందా ?, లేకు మీరు అలాంటి రూల్ కొత్తగా పెట్టారా ? అని ప్రజలు మండిపడుతున్నారు.
రైతులు లేకుంటే తిండి లేదు, కూలీలు లేకుండా ఏపనులు జరగవు, అంతెందుకు ఈ మెట్రో రైలు వెళ్లడానికి రైల్వే ట్రాక్ తో పాటు పిల్లర్లు వేసిన వాళ్లు, ఇసుక, సిమెంట్, కంకర మోసింది కార్మికులు, కూలీలు అని తెలీదా ? అంటూ బెంగళూరు మెట్రో రైలు ప్రయాణికులు బీఎంఆర్ సీఎల్ సిబ్బందిని నిలదీస్తున్నారు. అంతే కాకుండా బెంగళూరులో ప్రస్తుతం ఎండలో, వానలో మీ మెట్రో రైలు పనులు చేస్తున్నది కార్మికులే అనే విషయం ముందుగా బీఎంఆర్ సీఎల్ తెలుసుకోవాలని బెంగళూరు ప్రజలు మెట్రో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications