Cabinet expansion: సదామీసేవలో సదానందగౌడ, మంత్రి పదవి గోవిందా, కోర్టులో స్టే తెచ్చుకున్నా ?

బెంగళూరు: కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ ఆయన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ మొదలు అయ్యే కొన్ని గంటల ముందు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి డీవీ. సదానందగౌడ ఆయన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయిన డీవీ. సదానందగౌడ ప్రధాన మంత్రి మోదీ మంత్రి వర్గంలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. గతంలో రైల్వే శాఖా మంత్రిగా పని చేసిన డీవీ. సదానందగౌడ ఇటీవల తన పరువుకు భంగం కలిగే విధంగా మీడియాలో వార్తలు ప్రసారం కాకుండా స్టే తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి పదవిని కాపాడుకోవడానికి డీవీ. సదానందగౌడ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారని సమాచారం. సదామీసేవలో సదానందగౌడ ఇంతకాలం చెప్పిన సదానందగౌడ మంత్రి పదవి గోవిందా కావడంతో ఆయన వ్యతిరేక వర్గం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

మూడుసార్లు ఎంపీ


2009 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని ఉడిపి నియోజక వర్గం నుంచి, 2014, 2019 లో బెంగళూరు ఉత్తర లోక్ షభ నియోజక వర్గం నుంచి డీవీ. సధానందగౌడ ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీగా విజయం సాధించిన అనంత్ కుమార్ మరణించడంతో ఆయన నిర్వహిస్తున్న రసాయనాలు, ఎరువుల శాఖను మోదీ బెంగళూరుకు చెందిన మరో ఎంపీ డీవీ. సదానందగౌడకు అప్పగించారు.

మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రి

మోదీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో డీవీ. సదానందగౌడ రెండుసార్లు మంత్రి పదవి దక్కించుకున్నారు. 2011 ఆగస్టు 4వ తేదీ నుంచి 2012 జులై 11వ తేదీ వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన డీవీ. సదానందగౌడ తరువాత బీజేపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2006 నుంచి 2010 వరకు కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడిగా డీవీ. సదానందగౌడ పని చేశారు.

 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన డీవీ

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన డీవీ

2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత డీవీ. సదానందగౌడ రైల్వేశాఖా మంత్రిగా పని చేశారు. ఒక్కసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన డీవీ సదానందగౌడ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసిన డీవీ . సదానందగౌడ రసాయనాలు, ఎరువుల శాఖా మంత్రిగా పని చేశారు.

కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే ?

కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే ?

తన వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సమాచారం, తనకు సంబంధించిన ఎలాంటి తప్పుడు కథనాలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చూడటానికి మీడియాకు ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల డీవీ. సదానందగౌడ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆయన వాదనలు వినిపించారు.

 కోర్టులో స్టే తెచ్చుకున్నా కేంద్ర మంత్రి పదవి గోవిందా గోవింద !

కోర్టులో స్టే తెచ్చుకున్నా కేంద్ర మంత్రి పదవి గోవిందా గోవింద !

డీవీ. సదానందగౌడ పరువుకు భంగం కలిగించే రీతిలో ఎవ్వరూ ఎలాంటి వార్తలు ప్రసారం చెయ్యకూడదని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు అన్ని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం కోర్టులో స్టే తెచ్చుకున్నా చివరికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే కొన్ని గంటల ముందే డీవీ. సదానందగౌడ ఆయన పదవికి రాజీనామా చెయ్యాల్సి రావడంతో ఆయన వర్గీయులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+