వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: నీళ్లు ఎక్కువగా వాడాడని చితకబాది.. ఆపైన బూట్లు నాకించి..

నీళ్లు అధికంగా వాడిన పాపానికి తన ఇంట్లో అద్దెకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంటి యజమాని కొట్టడమేకాక, బూట్లు నాకించాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకున్న వారికి, ఇంటి యజమానికి ఏదో ఒక సందర్భంలో వివాదం రావడం సహజమే. అద్దెకుండే వారిపై అనేక ఆంక్షలు విధించడం పరిపాటే.

ఒకవేళ అద్దెకున్న వారికి, ఇంటి యజమానికిసరిపడకపోతే.. వార్నింగ్ ఇవ్వడమో, మహా అయితే ఖాళీ చేయించడమో చేస్తారు. కానీ ఏ ఇంటి యజమానీ ఇంత దారుణంగా మాత్రం ప్రవర్తించడు.

Bengaluru owner beats up North-Eastern tenant, made to lick shoes

కానీ బెంగళూరులో ఓ ఇంటి యజమాని మాత్రం దారుణ చర్యకు ఒడిగట్టాడు. నీళ్లు అధికంగా వాడుతున్నారని ఆరోపిస్తూ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన విద్యార్థులపై దాడి చేశాడు. వారిని తీవ్రంగా కొట్టడమే కాకుండా వారితో బలవంతంగా బూట్లు నాకించాడు.

ఈ ఘటనపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటి యజమాని హేమంత్ కుమార్ పై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. అనంతరం హేమంత్ కుమార్ బెయిల్ పై విడుదలయ్యాడు.

ఈ ఘటనపై బాధిత విద్యార్థుల్లో ఒకరి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని, ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన వారిని వదలిపెట్టకూడదని ఆయన పేర్కొన్నారు.

English summary
Higio Guntey, son of Executive Assistant Commissioner of Arunachal Pradesh, Higio Yame was allegedly assaulted by the owner of the house he was staying in Bengaluru. Guntey also has accused the owner of asking him to lick the owner’s shoes. Higio Guntey is a fourth-semester student in the Christ University in Bengaluru was allegedly abused by his house owner on Monday evening and was later beaten black and blue. The reason for all this is said to be that Guntey using extra water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X