ఇన్‌స్టాగ్రామ్ హార్రర్- బెంగళూరులో విద్యార్థినిపై కిరాతకం
బెంగళూరులో 19 సంవత్సరాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం రేపింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆహ్వానించిన పార్టీకి హాజరైన ఆమెపై ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేటు విల్లాలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డిక్సన్ శాండో, నిఖిల్ అనే ఇద్దరు యువకులను పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.
బాధితురాలి స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆమె అయిదు నెలల కిందటే బెంగళూరుకు వచ్చారు. పీజీలో ఉంటూ చదువుకుంటోన్నారు. జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డిక్సన్ శాండోతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. ఫిబ్రవరి 14 రాత్రి సాయంత్రం ఆమెకు డిక్సన్ ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం బెంగళూరు శివార్లలోని రెక్స్ విల్లాలో జరుగుతున్న పార్టీకి రావాలని ఆహ్వానించాడు.

ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం బాధితురాలు ఆమె తన స్నేహితురాలితో కలిసి రెక్స్ విల్లాకు వెళ్లారు. అక్కడ నిఖిల్ ను పరిచయం చేశాడు డిక్సన్. అనంతరం డిక్సన్, నిఖిల్ ఇద్దరూ బలవంతంగా టాబ్లెట్ కలిపిన డ్రింక్ ను తాగించారని బాధితురాలు ఆరోపించారు. అది తీసుకోగానే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి, స్పృహ కోల్పోయానని, తెలిపారు. స్పృహలేని స్థితిలో ఉన్న తనపై డిక్సన్, నిఖిల్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.
ఈ విషయం ఎవరికైనా చెప్పినా లేదా పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని నిందితులు బెదిరించారని, ఆ తర్వాత వారు ఓ మాల్ దగ్గర దించేసి వెళ్లిపోయారని చెప్పారు. ప్రాణభయం వల్ల తాను వెంటనే ఫిర్యాదు చేయలేకపోయానని బాధితురాలు వివరించారు. డిప్రెషన్ లోనయ్యానని, దీంతో ఫిబ్రవరి 17న బెంగళూరు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సైతం తీసుకున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత తన సోదరుడికి ఘటన గురించి చెప్పగా.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు.
ఆమె లిఖితపూరకంగా ఇచ్చిన ఈ ఫిర్యాదు ఆధారంగా అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో డిక్సన్ శాండో, నిఖిల్‌లపై కేసు నమోదు చేశారు. లైంగిక దాడి, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications