లవర్ తో పార్టీలు, నో చెప్పిన తండ్రిని ప్రియుడితో కలిసి చంపేసింది, సినిమా స్టోరీలు చెప్పింది!

బెంగళూరు: బెంగళూరులో హత్యకు గురైన వ్యాపారి కేసులో ఆయన కుమార్తెను, ప్రియుడిని రాజాజీనగర పోలీసులు అరెస్టు చేశారు. ఇంటిలో తనకు ఫ్రీడం (స్వాతంత్రం) లేదని, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలకు వెలుతానంటే అడ్డుపడుతున్నారని, అందుకే తన తండ్రిని ప్రియుడితో కలిసి హత్య చేశానని విద్యార్థిని విచారణలో అంగీకరించడంతో ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ కు గురైనారు.

రాజస్థాన్ చెందిన జైకుమార్ జైన్ (40) అనేక సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని రాజాజీనగరలోని బాష్యం సర్కిల్ లో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న ప్రాంతం సమీపంలోనే జైకుమార్ జైన్ భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. జై కుమార్ జైన్ కుమార్తె 9వ తరగతి చదువుతోంది.

ఇంటి బాత్ రూంలో జైకుమార్ జైన్ కాలిపోయిన స్థితిలో అనుమానస్పద స్థితిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. జైకుమార్ ఇంటి గదిలో రక్తపు మరకలు ఉన్న విషయం పోలీసులు గుర్తించారు. జైకుమార్ బెడ్ రూంలోనే రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

Bengaluru police arrested Jaikumar Jain daughter and her boy friend in connection with the Jaikumar Jain murder case.

కేసు విచారణ చేసిన పోలీసులు జైకుమార్ కుమార్తె మీద నిఘా వేశారు. జైకుమార్ కుమార్తె అతని ప్రియుడితో కలిసి అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయం గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి.

శనివారం జైకుమార్ భార్య, కుమారుడు పని మీద పుదుచ్చేరి వెళ్లారు. ఆ సమయంలో జైకుమార్ జైన్, అతని కుమార్తె మాత్రమే ఇంటిలో ఉన్నారు. స్నేహితులతో కలిసి పార్టీకి వెలుతానని కుమార్తె తండ్రి జైకుమార్ కు చెప్పింది. పార్టీకి వెళ్లడానికి తాను అంగీకరించనని జైకుమార్ కుమార్తెకు చెప్పాడు.

శనివారం రాత్రి జైకుమార్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. తరువాత ఇంటిలో ఉన్న జైకుమార్ కు కుమార్తె ఆమె ప్రియుడు నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చారు. నిద్రమత్తులో జారుకున్న జైకుమార్ ను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశారు.

జైకుమార్ రక్తం బెడ్ రూంలో పడింది. ఎక్కడ పోలీసులకు చిక్కిపోతామో అనే భయంతో అతని కుమార్తె, ఆమె ప్రియుడు కలిసి జైకుమార్ శవాన్ని బాత్ రూంలో తగలబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జైకుమార్ కుటుంబ సభ్యుల మీద నిఘా వేశారు.

అనుమానంతో జైకుమార్ కుమార్తె, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇంటిలో తనకు స్వాతంత్రం లేదని, స్నేహితులతో కలిసి పార్టీలకు వెలుతానంటే తనకు తండ్రి జైకుమార్ అభ్యంతరం చెప్పేవాడని, అందుకే ప్రియుడితో కలిసి హత్య చేశానని 9వ తరగతి విద్యార్థిని అంగీకరించిందని పోలీసులు అన్నారు. జై కుమార్ కుమార్తె, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+