బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వానికి పంగనామాలు: 6 మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెలేపై 420 కేసులు, ఎన్నికల దెబ్బ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మేయర్ ఎన్నికల్లో తప్పుడు చిరుమానా సమర్పించి ప్రజలు, ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపిస్తూ ఆరు మంది సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ఓ మాజీ శాసన సభ్యుడి మీద బెంగళూరు పోలీసులు 420 కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కేవలం స్వార్థం కోసం నాయకులు తప్పుడు చిరునామాలు సృంచిచారని రాయచూరుకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసి కేసు నమోదు అయ్యింది.

బెంగళూరు మేయర్ ఎన్నికలు

బెంగళూరు మేయర్ ఎన్నికలు

బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆరు మంది ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎమ్మెల్యే తప్పుడు చిరునామాలు సృంచిచారని ఆరోపణలు రావడంతో ప్రత్యేక న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.

కోర్టు ఆదేశాలు

కోర్టు ఆదేశాలు

ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేసిన ప్రజాప్రతినిధుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని ఇంతకాలం మోసం చేసిన ప్రజాప్రతినిధుల మీద కేసులు నమోదు చెయ్యాలని న్యాయస్థానం చూసించింది.

చీటింగ్ లీడర్స్ లిస్ట్

చీటింగ్ లీడర్స్ లిస్ట్

న్యాయస్థానం ఆదేశాలతో కర్ణాటక విధాన పరిషత్ సభ్యులు (ఎమ్మెల్సీలు) రఘు ఆచార్, ఎస్. రవి, ఎన్ఎస్, బోస్ రాజ్, ఆర్ బీ. తిమ్మాపుర, అల్లం వీరభద్రప్ప, సీఆర్. మనోహర్, ఎన్. అప్పాజీ గౌడ, మాజీ ఎమ్మెల్యే ఎండి. లక్ష్మీనారాయణల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరు మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే ముందస్తు జామీనుకు కోర్టును ఆశ్రయించారు.

బీజేపీ-కాంగ్రెస్ పోటీ

బీజేపీ-కాంగ్రెస్ పోటీ

2016 సంవత్సరంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎన్నికలు జరిగాయి. ఆ సందర్బంలో బీజేపీ-కాంగ్రెస్, జేడీఎస్ కార్పొరేటర్లు తమ పార్టీలకు చెందిన కార్పొరేటర్ ను మేయర్ గా గెలిపించుకోవడానికి పోటీ పడ్డారు. ఆ సమయంలో తాము బెంగళూరులో నివాసం ఉంటున్నామని ఈ ఏడు మంది తప్పుడు చిరునామా సమర్పించి మేయర్ ఎన్నికల్లో ఓటు వేశారు.

నకిలి బిల్లులతో జల్సా

నకిలి బిల్లులతో జల్సా

తాము సొంత నియోజక వర్గాల్లో నివాసం ఉంటున్నామని నకిలి బిల్లులు సమర్పించిన ఈ 7 మంది నాయకులు ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్నారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసి స్పీకర్, శాసన మండలి సభాపతికి ఫిర్యాదు చేశారు.

420 కేసులు

420 కేసులు

ఆరు మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే మీద స్పీకర్, శాసన మండలి సభాపతి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చీటింగ్ చేసిన వారి మీద కేసులు నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంది. ఆరు మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే మీద పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తమ మీద 420 కేసు నమోదు కావడంతో ఆరు మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే ముందు జామీను కోసం కోర్టును ఆశ్రయించారు.

English summary
Bengaluru police files FIR against 7 present legislative council members and one former legislative council member as per the special court order. All MLAs were accused of giving false information to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X