టన్నుల టన్నుల టమాటాలు కిడ్నాప్, దేవుడా, సినిమా స్కెచ్ తో ఏం చేశారంటే !

బెంగళూరు/కోలారు: మనుషులు ఎప్పుడు ఎలా ప్రవర్థిస్తారో ఆదేవుడికే తెలియాలి. టమాటాలు ధరలు ఆకాశానికి తాకడంతో ఇప్పుడు ఆ టమాటకు భలే డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం టమాటా పంటలు చేతిలో ఉన్న రైతులు లక్షాధికారులు అయిపోయారు. ఓ పక్క వానలు, మరో పక్క టమాటా పంటలు తక్కువగా ఉండటంతో టమాటాలకు డిమాండ్ పెరిగిపోయింది.

టమాటా ధర విపరీతంగా ఉండడంతో బెంగళూరు- తుమకూరు రోడ్డులోని గురగుంటపాళ్య సమీపంలో 2 టన్నుల టమాటాతో వెళ్తున్న వాహనం కారును ఢీకొట్టింది. తరువాత గుర్తు తెలియని వ్యక్తులు రైతులను కిందకు దించి రెండు టన్నులు టమోటాలు ఉన్న వాహనాన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి పారిపోవడంతో కేసు నమోదు అయ్యింది. ఇలాంటి విచిత్రం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bengaluru police have registered a case of kidnapping of a Mahindra vehicle containing two tonnes of tomatoes

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకా రేణుకాపురకు చెందిన మల్లేష్, శివన్న అనే రైతులు రూ. 2 లక్షలకు పైగా ఉన్న టమోటాలు విక్రయించడానికి బయలుదేరారు. తమ వాహనం నిండా విలువైన టమాటాలను పోగొట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహనం ఆచూకీ కోసం పోలీసులు సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన కోలారు ఏపీఎంసీ మార్కెట్‌కు రైతులు టమోటాలను తరలిస్తుండగా టమాటలు తరలిస్తున్న వాహనాన్ని కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.

మల్లేష్, శివన్న తమ మహీంద్రా పికప్ వాహనంలో 200 క్రేట్ లలో టమాటాలు నింపుకుని చల్లకెరె నుంచి కోలార్‌కు బయలుదేరారు. తుమకూరు రోడ్డు మీదుగా బెంగళూరులోకి ప్రవేశించి గురగుంటపాళ్య రింగ్ రోడ్డు వద్ద మలుపు తీసుకుని కోలారు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో మహీంద్రా పికప్ వాహనం ఓ కారును ఢీకొట్టింది. వెంటనే కారులో ఉన్నవారు కిందకు దిగి మహీంద్రా వాహనంలో ఉన్నవారిపై గొడవకు దిగారు.

Bengaluru police have registered a case of kidnapping of a Mahindra vehicle containing two tonnes of tomatoes

కారు రిపేర్ చేయించాలని టమాట రైతులను డిమాండ్‌ చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని రైతులు, టమాటాలు తరలిస్తున్న మహింద్రా వాహనం డ్రైవర్ చెబుతున్నా ఆ కారులో ఉన్న వాళ్లు వినిపించుకోలేదు. అనంతరం కారులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు రైతులు శివన్న, మల్లేష్‌లను బెదిరించి వారి మీద దాడి చేసి టమాటలు ఉన్న మహింద్రా వాహనాన్ని వాళ్లే స్వయంగా నడుపుకుంటూ కేఆర్‌ పురంకు తీసుకెళ్లారు.

అక్కడ రైతులు తీసుకువచ్చిన టమాటాలను విక్రయించి ఆ డబ్బుతో కారు రిపేర్ చేయించుకోవాలని అనుకున్నారు. అయితే స్పాట్ లో టమాటాలను విక్రయించడానికి వారికి సాధ్యం కాలేదు. తరువాత కారులో ఉన్న వ్యక్తులు రైతులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు కూడా డబ్బులు లేవని రైతులు ఆ కారు యజమానులకు చెప్పారు.

Bengaluru police have registered a case of kidnapping of a Mahindra vehicle containing two tonnes of tomatoes

డబ్బులు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో రగిలిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు మహింద్రా వాహనంలో ఉన్న టమోటాలు అమ్మి కారు రిపేరు చేసుకుంటామని చెప్పి ఆ వాహనంతో సహ పరారయ్యారు. దీంతో రైతులు తమ యజమానికి ఫిర్యాదు చేశారు. టమాటా పంటల యజమాని సూచన మేరకు రైతులు బెంగళూరులోని ఆర్‌ఎంసీ యార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విచిత్రమైన టమాటాల కిడ్నాప్ కేసు ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు, మహీంద్రా వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు. నిందితులు ఏమైనా టమాటాలను ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె. అంగళ్లు, పలమనేరులో విక్రయించడానికి వెళ్లారా ? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+