బెంగళూరులో మరో'సారీ': ఎనిమిదేళ్ల చిన్నారిపై పీటీ టీచర్, లాఠీఛార్జ్
బెంగళూరు: కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మరోసారి దారుణం వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలిక లైంగిక వేధింపులకు గురయింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.
విద్యార్థినిని పీఈటీ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. టీవీ, ఆంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటీ టీచర్ పదేళ్లుగా అదే పాఠశాలలో పని చేస్తున్నాడు. అదే ఉపాధ్యాయుడి పైన గతంలోను పలుమార్లు ఆరోపణలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.

ఈ ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చి పాఠశాల ముందు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల పైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. కాగా, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. అంతేకాదు, టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని తెలుస్తోంది.గత ఏడాది బెంగళూరులో మూడు వేర్వేరు పాఠశాలల్లో చిన్నారులను వేధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications