బెంగళూరులో అతిభారీ వర్షం- రోడ్లు జలమయం: విరిగిపడ్డ చెట్లు

బెంగళూరు.. ఒక్కసారిగా కురిసిన అతి భారీ వర్షంతో అతలాకుతలమైంది. గత రెండు రోజులుగా నగరంలో మేఘావృత వాతావరణం నెలకొన్నప్పటికీ, మంగళవారం సాయంత్రం దంచి కొట్టింది. దట్టమైన నల్లమబ్బులు కమ్ముకున్నాయి. ఆ తర్వాత దాదాపు రెండుగంటల పాటు ఎడతెరిಪಿ లేకుండా కుండపోత వర్షం కుರವడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో నగర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంಭించిపోయింది.

ఆఫీస్ పనివేళలు ముగిసి ఉద్యోగులు, సాధారణ ప్రజలు గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో వర్షం పడటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బైకర్స్ మెట్రో స్టేషన్లు, బస్ షెల్టర్లు, దుకాణాల ముంగిట ఆశ్రయం పొందారు. కార్లు, బస్సులతో సహా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పలు ప్రధాన మార్గాలలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సంభవించింది. నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులకు తీవ్ర ఆటంకాలు కలిగించాయి.

Bengaluru Rainfall Gridlocks City with Knee-Deep Water Road and Key Junctions Struggle to Get Home

బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మెజెస్టిక్, గాంధీనగర్, కబ్బన్ పార్క్ రోడ్డు, విధానసౌధ పరిసరాలు, హలసూరు, ఎంజీ రోడ్, శివాజీనగర్, హెబ్బాళ, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రోడ్, ఆర్టీ నగర్, మల్లేశ్వరం వంటి కీలక ప్రాంతాల్లో రహదారుల్లో మోకాళ్ల లోతు వరద నీరు నిలిచింది. అవి మార్గం లేకపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లు చెరువులుగా దర్శనం ఇచ్చాయి. కొన్నిచోట్ల భారీ వృక్షాలు సైతం విరిగిపడ్డాయి.

వాతావరణంలో సంభవించిన ఈ మార్పుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) విపత్తు నిర్వహణ బృందాలు వెనువెంటనే రంగంలోకి దిగి రహదారులపై కూలిపోయిన చెట్లు, నిలిచిపోయిన వరద నీటిని తొలగించడానికి రంగంలోకి దిగాయి.

బెంగళూరు ఐఎండీ అందించిన తాజా బులిటెన్ ప్రకారం.. మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావం కారణంగా అటు కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొనవచ్చు. బెంగళూరు, బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, తుమకూరు, మైసూరు, మండ్య, చామరాజనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

రాబోయే రోజుల్లో వాహనదారులు రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసు విభాగం హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ తీగలు, లోతట్టు వంతెనల కింద ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రజలందరూ ప్రయాణాలకు ముందే వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ క్షేమంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని బీబీఎంపీ సైతం విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+