బెంగళూరుకెళ్లొద్దురో..

Bengaluru temperature: బెంగళూరు సిటీ మండిపోతోంది. ఉద్యాననగరి తగలబడుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతోంది. ఎండ దెబ్బకు పాత రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. వేడిగాలులు బెంగళూరియన్లను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోన్నాయి.

ప్రతి సంవత్సరం కూడా మార్చి/ఏప్రిల్ ప్రారంభంలోనే బెంగళూరులో చెప్పుకోదగ్గ వర్షాలు పడేవి. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఈ ఏడాది కూడా అంచనాలు దారుణంగా తప్పాయి. నడివేసవి రాకముందే ఇక్కడ రోళ్లు పగిలేలా ఎండ తీవ్రత ఉంటోంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోండటం ఇక్కడి నగరీకరణ తీవ్రతకు అద్దం పడుతోంది.

Bengaluru recorded a maximum temperature of 38 5 degrees Celsius on April 28

ఈ సీజన్‌లో అత్యధికంగా 38.5 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రత ఈ నెల 28వ తేదీన నమోదైంది బెంగళూరు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఎండ ఎప్పుడూ లేదు. 2016 ఏప్రిల్ 25వ తేదీన చివరిసారిగా 39.2 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. ఆ తరువాత ఎప్పుడూ కూడా ఇంత ఎండ కాయలేదు.

ఈ సీజన్‌లో మాత్రం అదే ఏప్రిల్ నెలలో 38.5 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఇది. రాత్రి ఉష్ణోగ్రత సైతం 30 డిగ్రీలకు తక్కువగా నమోదు కావట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. మే లో 40 డిగ్రీలను తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

గత సీజన్‌లో సరైన వర్షాలు పడకపోవడం వల్ల నీటి కొరత సైతం ఏర్పడిన విషయం తెలిసిందే. భూగర్భ జలాలు అడుగంటాయి. బెంగళూరు సిటీతో పాటు శివార్లల్లో ఉన్న చెరువులు ఎండిపోయాయి. అనేక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితి కొనసాగుతోంది ఇంకా. ఎండ తీవ్రత అధికం కావడం వల్ల నీటి వినియోగం రెట్టింపయింది. ట్యాంకర్లకు సైతం కొరత ఏర్పడింది.

రెండు వారాల కిందటే చెప్పుకోదగ్గ వర్షాలు పడినప్పటికీ- అది కంటి తుడుపు మాత్రమే అయింది. అరకొరగా వర్షాలు పడిన తరువాత ఉక్కపోత జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. ఎప్పుడూ వాహన ప్రవాహంతో రద్దీగా కనిపించే బెంగళూరు రోడ్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోన్నాయంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

బెంగళూరుకు ఉద్యాననగరిగా పేరుంది. ఇప్పుడిక్కడి పరిస్థితులను చూస్తోంటే అది గతం అన్నట్లుగా తయారైంది. విపరీతంగా నగరీకరణ చోటు చేసుకోవడం వల్ల చెట్లన్నింటినీ కొట్టివేయాల్సి వచ్చింది. శివార్లల్లో లేఅవుట్ విచ్చలవిడిగా ఏర్పడ్డాయి. ఫలితంగా పచ్చదనం మచ్చుకైనా కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+