ఎమ్మెల్యేకే టోకరా.. అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు మాయం

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అకౌంట్ నుంచి దాదాపు రూ.2 లక్షలు మాయం అయ్యాయి. చెన్నపట్న నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన అకౌంట్ నుంచి రూ.1.9 లక్షలు ఎవరో మోసపూరితంగా విత్ డ్రా చేశారని ఆయన బనశంకరి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జేసీ రోడ్డు శాఖలోని తన ఖాతా నుంచి మార్చి 18న ఈ డబ్బు చోరీ జరిగినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Bengaluru: Rs 1.9 lakh stolen from my account, says Congress MLA

ముంబై, పూణే నుంచి వీటిని విత్ డ్రా చేసినట్లు కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ చోరీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏటీఎం కార్డు ద్వారా జరిగిందా? లేక సైబర్ క్రిమినల్స్ ఇతర పద్ధతుల ద్వారా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

విత్ డ్రా కు అవకాశముండే అన్ని రకాల విధానాలపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే ఈ సైబర్ క్రిమినల్స్ ను పట్టుకుంటామని బనశంకరి పోలీసులు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru: Channapatna Congress MLA C.P. Yogeshwar has filed a complaint at the Banashankari police station stating that Rs 1.9 lakh was fraudulently withdrawn from his account on March 18. The amount was withdrawn from his account in SBI, JC Road branch. He has stated in his complaint that the amount was withdrawn from Mumbai and Pune.The police are investigating to find out whether the cybercriminals have withdrawn the amount cloning his ATM card or through other methods.
Please Wait while comments are loading...