ఇంటిముందే ఐబిఎం ఉద్యోగిని పొడిచి చంపారు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంప్యూటర్ హార్డ్‌వేర్ దిగ్గజం కాల్ సెంటర్ ఉద్యోగిని దుండగులు 9సార్లు కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అతని ఇంటి ముందే జరగడం గమనార్హం.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఈ దారుణ ఘటన పంథరపాల్యాలో గురువారం ఉదయం 4గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడిని అభిషేక్ తిమ్మరాయప్ప(30)గా గుర్తించారు.
కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటి వద్దకు చేరుకున్న అభిషేక్‌ను కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. 9సార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడే కుప్పకూలిపోయాడు.

అభిషేక్ అరుపులు విన్న అతని అంకుల్.. వెంటనే బయటికి వచ్చి అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అభిషేక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, నయందనహళ్లిలోని న్యూ నేషనల్ స్కూల్‌కు యాజమనిగా కూడా అభిషేక్ ఉన్నారు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహం కాగా, రెండేళ్ల కూతురు ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications