ఉరేసుకుని టెక్కీ మృతి: కుళ్లి, దుర్వాసన వేసిన శవం
చెన్నైకి చెందిన ఓ టెక్కీ బెంగళూరులోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శవం కుళ్లిపోయి దుర్వాసన వేసింది.
బెంగళూరు: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్లందూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడిని చెన్నైకి చెందిన అజా సర్ఫుద్దీన్‌గా గుర్తించారు.
కుళ్లిపోయిన స్థితిలో దుర్వాసన వేస్తున్న శవాన్ని అతని మిత్రులు గురువారం సాయంత్రం చూశారు. అతను బుధవారంనాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. తన అక్కతో మాట్లాడిన తర్వాత అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుకుంటున్నారు.

గురువారంనాడు ఆమె తన సోదరుడికి ఫోన్ చేసింది. అయితే అతని నుంచి ఏ విధమైన ప్రతిస్పందన కూడా రాలేదు. దాంతో ఆమె అతని మిత్రులకు ఫోన్ చేసి ఓసారి చూసి రావాల్సిందిగా కోరింది. దాంతో మిత్రులు అతని ఫ్లాట్‌కు వచ్చారు. సర్ఫుద్దీన్ తలుపులు తీయలేదు.
లోపలి నుంచి దుర్వాసన వస్తుండడాన్ని వారు పసిగట్టారు. తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూసే సరికి అతని శవం వేలాడుతూ కనిపించింది. అయితే, సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. అతను సార్జాపూర్ రోడ్డులో గల ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు












Click it and Unblock the Notifications