తల్లిదండ్రులను ఒకేసారి చంపేసిన కొడుకు చివరికి కొడుగులో కారులో ఏం చేశాడంటే ?

బెంగళూరు/కొడుగు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఏం కావాలన్నా ఆ తల్లిదండ్రులు తీసిచ్చారు. అయితే అదే కుమారుడి చేతిలో ఆ తల్లిదండ్రులు ఒకేసారి దారుణ హత్యకు గురికావడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.

బెంగళూరు-బళ్లారి రోడ్డులోని బ్యాటరాయణపుర సమీపంలోని కొడిగేహళ్లి ప్రాంతంలో భాస్కర్ (60), శాంత (58) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్నప్పటి నుంచి భాస్కర్, శాంత దంపతులు చాలా సంతోషంగా జీవించారు. భాస్కర్, శాంత దంపతులకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భాస్కర్, శాంత దంపతులు చాలా హ్యాపీగా జీవించారు.

deadbody2
భాస్కర్, శాంత దంపతులకు శరత్ (25) అనే కుమారుడు ఉన్నాడు. కుమారుడు శరత్ ఏమి కావాలంటే అది తీసి ఇచ్చిన భాస్కర్, శాంత దంపతులు అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. కుమారుడు శరత్ మన సర్వస్వం అని భాస్కర్, శాంత దంపతులు ఇంతకాలం అనుకుంటూ జీవించారు.

ఈనెల 17వ తేదీన భాస్కర్, శాంత దంపతులు వారు నివాసం ఉంటున్న ఇంటిలోనే దారుణ హత్యకు గురైనారు. భాస్కర్, శాంతల తలల మీద ఇనుపరాడ్ తో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. ఇదే సమయంలో భాస్కర్, శాంత దంపతుల కుమారుడు శరత్ మాయం అయ్యాడని వెలుగు చూసింది.

police

తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశారు అని పోలీసులు భాస్కర్ కు ఫోన్ చెప్పాలని ప్రయత్నిస్తే అతను ఎవరి ఫోన్లు రిసీవ్ చెయ్యలేదు. పోలీసులు శరత్ మొబైల్ ఫోన్ ట్రేస్ చేశారు. కొడుగులో శరత్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు భాస్కర్, శాంతను తానే హత్య చేశానని, తన తల్లిదండ్రులు తన గురించి చెడుగా అందరికి ప్రచారం చేస్తున్నారని, అదే కోపంతో తానే ఇద్దరిని ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాను అని శరత్ అంగీకరించాడని పోలీసు అధికారులు చెప్పారు.

ఇదే కారణంగా భాస్కర్, శాంత దంపతులు హత్యకు గురైనారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులను హత్య చేసిన తరవాత శరత్ అతని కారులో కొడుగుకు పరారైనాడని, లాడ్జ్ తీసుకుని బస చేస్తే పోలీసులకు చిక్కిపోతామని ఇన్ని రోజులు రాత్రిపూట కారులోనే కాలం గడిపాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+