బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

gym trainer: పోలీస్ స్టేషన్ పక్కనే ఇల్లు తీసుకున్నాడు. జిమ్ ట్రైనర్ ఏం చేశాడంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చోరీలు, దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ లు, చోరీలు చేసే నిందితులు పోలీసులను చూసి భయంతో పారిపోతారు. లేదంటే ఊరు వదిలి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. అయితే ఇక్కడ ఓ జిమ్ ట్రైనర్ ఎవ్వరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్ పక్కనే ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ అతను అనుకున్న పనులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మనోడు పోలీసులకు చిక్కకుండా 20 రోజుల్లో 20 కేజీత బరువు తగ్గి పోలీసులకే షాక్ ఇచ్చాడు.

Wife: భార్య ఏం చేసిందంటే ?, తిక్కలోడు కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ కోసేసి, ఓరీ ముర్ఖుడా, ఎవరికి నష్టం !Wife: భార్య ఏం చేసిందంటే ?, తిక్కలోడు కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ కోసేసి, ఓరీ ముర్ఖుడా, ఎవరికి నష్టం !

 బెంగళూరులో జిమ్ ట్రైనర్

బెంగళూరులో జిమ్ ట్రైనర్

బెంగళూరులో జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్న మంజు అలియాస్ జిమ్ మంజు అనే యువకుడు బెంగళూరులోని సీకే అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆరు నెలల నుంచి మంజు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. జిమ్ ట్రైనర్ గా వచ్చే జీతం జిమ్ మంజుకు సరిపోలేదు. ఎలాగైనా డబ్బు సంపాధించాలని మంజు ఆలోచించాడు.

 ఆంటీ మెడలో చైన్ మాయం

ఆంటీ మెడలో చైన్ మాయం

బలంగా ఉన్న జిమ్ మంజు చైన్ స్నాచింగ్ లు చెయ్యాలని అనుకున్నాడు. పక్కాప్లాన్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీన పూర్ణ రాజ్ అలియాస్ పూర్ణ అనే మహిళ గొలుసును లాక్కొని పరారయ్యాడు. చోరీ జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పూర్ణా నుంచి వివరాలు సేకరించారు. మంచి జిమ్మర్ తన మెడలో గొలుసు లాక్కొని వెళ్లాడని పూర్ణ రాజ్ పోలీసులకు చెప్పారు.

 బేకరీలో టీ తాగుతూ ?

బేకరీలో టీ తాగుతూ ?

పోలీస్ స్టేషన్ సమీపంలోని బేకరీ దగ్గరకు వెలుతున్న జిమ్ మంజు టీ తాగుతూ పోలీసుల కదలికలు గమనిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఎందుకు మంజు ఎక్కువగా బేకరి దగ్గర నిలబడి పోలీస్ స్టేషన్ వైపు చూస్తున్నాడని పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే మంజును పోలీసులు అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

 పోలీసుల భయంతో 20 రోజుల్లో 20 కేజీలు లాస్

పోలీసుల భయంతో 20 రోజుల్లో 20 కేజీలు లాస్

చైన్ స్నాచింగ్ చేసి రోజు మంజు అతను వేసుకున్న చొక్కాను ఇంటిలోనే తగులబెట్టాడు. తొలిసారి నేరం చేసిన నిందితుడు మంజు పోలీసులకు పట్టుబడతాడేమోనని భయంతో జిమ్ బాడీని 20 రోజుల్లో 20 కిలోలు తక్కువ చేశాడని వెలుగు చూసింది. నిందితుడు మంజును అరెస్టు చేసిన సీకే అచ్చుకట్ట పోలీసులు నిందితుడి నుంచి రూ 2 లక్షలల విలువైన బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఇల్లు తీసుకుని ఎవ్వరికి అనుమానం రాకుండా చైన్ స్నాచింగ్ లు చెయ్యడానికి ప్రయత్నించి జిమ్ ట్రైవర్ మంజు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

English summary
Bengaluru: What did the gym trainer do when he got a house next to the police station?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X