దేశం కోసం..ధర్మం కోసం: ఒవైసీని ఆఫ్ఘన్‌కు పంపించడం బెటర్: కేంద్రమంత్రి శోభా కరంద్లాజె

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు.. భారత్‌లో రాజకీయ దుమారానికి దారి తీస్తోన్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పేరును వినియోగించడం దేశ రాజకీయాల్లో సాధారణంగా మారింది. చివరికి- పెట్రోల్ ధరలు అధికం అయ్యాయంటూ వాపోతోన్న వారికి కూడా ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ సూచిస్తోన్నారు బీజేపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు.

తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై కొనసాగుతోనన ఆకృత్యాలను భారత్‌లోని పరిస్థితులతో పోల్చిన అఖిల భారత్ మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, అయిదేళ్ల లోపు చిన్న పిల్లలపై తాలిబన్లు యథేచ్ఛగా దాడులు చేయడం పట్ల కొందరు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారని, భారత్‌లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఒవైసీ చెప్పారు.

Better to send Asaduddin Owaisi to Afghanistan to protect their women: Shobha Karandlaje

భారత్‌లో ప్రతి తొమ్మిదిమంది అయిదేళ్లలోపు పిల్లల్లో ఒకరు మరణిస్తున్నాని, మహిళలపై దాడులు, నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయంటూ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని, అలాంటి దుస్థితే ఇక్కడ లేదా అంటూ ఆయన నిలదీశారు. దీనిపట్ల బీజేపీ నేతలు ఘాటుగా ప్రతిస్పందిస్తోన్నారు. ఒవైసీపై మాటల దాడికి దిగుతున్నారు.

కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడులను అరికట్టడానికి అసదుద్దీన్ ఒవైసీనీ వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించడం బెటర్ అని కౌంటర్ అటాక్‌కు దిగారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల చెర నుంచి విడిపించడానికి, అక్కడి సామాజిక వర్గాన్ని కాపాడటానికి ఒవైసీని అక్కడికి పంపించాలని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+