Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారతీయులూ జాగ్రత్త: రక్తం పారిస్తామన్న ఆల్‌ఖైదా

బెంగళూరు: భారత భద్రతా దళాలను హెచ్చరిస్తూ ఆల్‌ఖైదా తాజాగా విడుదల చేసిన తన మేగజైన్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. 117 పేజీలతో విడుదల చేసిన ఈ మెగజైన్‌లో ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, బంగ్లాదేశ్ లతోపాటు చైనా చిత్రాలను కూడా ప్రచురితం చేసింది. పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన పేలుడు జరిగిన నేపథ్యంలో ఆల్‌ఖైదా వ్యాఖ్యలు చేయడం

‘అవామీ లీగ్‌ను బంగ్లాదేశ్ ఆవలికి నెట్టండి'

జమాతే ఉల్ బంగ్లాదేశ్, జమాతే ఉల్ ఇస్లామీ, ఆల్‌ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్‌ను అధికారం నుంచి దించేయాలని పిలుపునిచ్చాయి. బంగ్లాదేశ్‌ను హిందూ దేశంగా తయారు చేయాలని అవామీ లీగ్ ప్రయత్నిస్తోందని ఆల్‌ఖైదా ఉపఖండ అధిపతి అసీమ్ ఉమర్ చెప్పారు. అంతేగాక బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఇప్పటికీ అనేక హిందూ విగ్రహాలున్నాయని తెలిపాడు.

‘హిందూయిజం బంగ్లాదేశ్‌కు క్యాన్సర్'

Beware Indians: We will shed blood in Kashmir soon, says al-Qaeda magazine

హిందూయిజం అనేది బంగ్లాదేశ్‌కు క్యాన్సర్ లాంటిదని, అది దేశం మొత్తం విస్తరిస్తుందని ఉమర్ వ్యాఖ్యానించాడు. ఇదంతా అవామీ లీగ్ వల్లే జరుగుతోందని ఆరోపించిన ఉమర్, దాన్ని బంగ్లాదేశ్ నుంచి ముస్లిం సోదరులు తోసివేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలనే చేసిన జెఎంబి పశ్చిమబెంగాల్‌లో ఓ బాంబు ఫ్యాక్టరీని ప్రారంభించించినట్లు సమాచారం. అవామీ లీగ్‌ను బంగ్లాదేశ్ నుంచి పారద్రోలేందుకు ఇది పని చేస్తున్నట్లు తెలిసింది.
కాగా, ఆల్‌ఖైదా సహకారంతోనే జెఎంబి బాంబు దాడులకు పాల్పడేందుకు సిద్ధమైనట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది.

చైనాపై ఆల్‌ఖైదా కన్ను

మెగాజైన్ కథనం ప్రకారం.. ప్రస్తుతం ఆల్‌ఖైదా తన కార్యకలాపాలను చైనాలో కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జినిజియాంగ్ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకర్తలను తయారు చేసినట్లు సమాచారం. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని ఆల్‌ఖైదా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అందువల్ల తన కార్యకలాపాలను త్వరితగిన వ్యాపింపజేసే అవకాశం ఉంది.

చైనాను లక్ష్యంగా చేసుకుని ఆల్‌ఖైదా తన కార్యకలాపాలను విస్తరిస్తోందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ధృవీకరిస్తోంది. చైనాలోని వివిధ ప్రాంతాలను ఇస్లామీకరణ చేసేందుకు తాలిబన్లతో కలిసి ఆల్‌ఖైదాతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొంది.

యుపిలోని ముజఫర్‌నగర్ అల్లర్లపై ఆల్‌ఖైదా మేగజైన్

ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత షామిలి క్యాంపులలో ఆశ్రయం పొందిన ముస్లింల గురించి ఆల్‌ఖైదా ఉపఖండ అధిపతి పలు వ్యాఖ్యలు చేశాడు. పునరావాస కేంద్రాల్లో ముస్లింలు శరణార్థులుగా ఉన్నారని అన్నాడు. ఓ సమయంలో గర్వంగా జీవించిన వారు అంటరానివారిలా జీవనం గడుపుతున్నారని అన్నాడు. ఒకసారి చరిత్రను తెలుసుకోండి.. 1857లో బ్రిటీషువారికి వ్యతిరేకంగా జిహాద్ రక్షణ కోసం మీరు చేసిన యుద్ధాన్ని గుర్తు తెచ్చుకోండని ఉమర్ ఆల్‌ఖైదా మేగజైన్‌లో పేర్కొన్నాడు.

‘మీరు శరణార్థుల్లా బతకొద్దు. రాజులుగా జీవించాలి. మీరు అనుభవించిన దాన్ని సాధించుకునేందుకు చేతులు పైకెత్తాలి' అని ఉమర్ పిలుపునిచ్చాడు. అతడ్ని ఉస్తాద్ ఉమర్ అని కూడా కొన్ని రాష్ట్రాల్లో పిలుచుకుంటారు.

కాశ్మీర్‌పై ఆల్‌ఖైదా మేగజైన్

కాశ్మీర్‌పై కూడా అసీమ్ ఉమర్ మేగజైన్‌లో పలు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామిక్ కోసం కాశ్మీర్‌లో రక్తపాతం సృష్టిస్తామని పేర్కొన్నాడు. ‘మేము ఇప్పటికే అఫ్ఘనిస్థాన్‌లో రక్తాన్ని పారించాం. కాశ్మీర్‌లో కూడా అదే చేస్తాం. షరియా చట్టం అమలు కోసం యుద్ధం చేస్తాం' అని మేగజైన్‌లో అసీమ్ ఉమర్ వ్యాఖ్యానించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+