వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సిసోడియా! మోడీ-సిబిఐతో జాగ్రత్త!’: కేజ్రీవాల్ సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పాలన తీరుతో కంటే తన ట్వీట్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి సంచలన ట్వీట్ చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. తన ట్వీట్‌లో
'సిసోడియా.. సీబీఐని మోడీ నీదగ్గరకు పంపుతారుజాగ్రత్త..' అంటూ కేజ్రీవాల్ ట్వీటు చేశారు.

'మనీష్‌ సిద్ధంగా ఉండు.. మోడీజీ నీపైకి సీబీఐని పంపించడంగానీ లేకపోతే అసలు ఈ భవనాలను నిర్మించే అధికారం నీకు లేదని గానీ ప్రకటిస్తారు' అంటూ వ్యంగ్యాంగా ట్వీట్‌ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ సీబీఐని రాజకీయకక్షల కోసం వాడుకుంటున్నారనే అర్థం వచ్చేట్లు ఆయన ట్వీట్‌ చేశారు. డిల్లీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా ఇటీవల కొత్తగా నిర్మించిన కళాశాల భవనాలను ప్రారంభించారు. దీనిని సాకుగా చూపుతూ ఆయనపై ప్రధాని సీబీఐని పంపిస్తారేమోనని అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుమానం వ్యక్తం చేశారు.

 Beware, Modi Ji Will Send CBI Against You, Arvind Kejriwal Warns Deputy

సిసోడియా బుధవారం పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ కళాశాలలో నిర్మించిన కొత్త భవనాలను పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్ర జైన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇబ్బంది పెట్టినా తాము పనిచేస్తూనే ఉన్నామని, పీడబ్ల్యూడీ ఇంజినీర్లు ఈ భవనాలను అద్భుతంగా నిర్మించారని పేర్కొన్నారు.

ఏటా దిల్లీలో 2.5 లక్షల మంది విద్యార్థులు పన్నెండో తరగతి పూర్తి చేస్తే.. వారిలో 1.25 లక్షల మంది మాత్రమే ఉన్నత విద్యకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ కళాశాలలకి వెళుతున్నారని సిసోడియా అన్నారు. అంతేగాక, మిగిలిన 1.25లక్షల మంది కూడా ఉన్నత, సాంకేతిక విద్యలు అభ్యసించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్‌లర్‌, కళాశాలల ప్రిన్సిపల్స్‌ తమ వద్దకు వస్తే వారికి కావాల్సిన వనరులన్నీ తాము సమకూరుస్తామని సిసోడియా తెలిపారు.

English summary
In a subtle swipe at Prime Minister Narendra Modi, Delhi Chief Minister Arvind Kejriwal on Wednesday cautioned his deputy Manish Sisodia, who inaugurated a newly constructed college building, to "be prepared" to face the CBI any moment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X