విష నేతలతో జాగ్రత్త: దేశ ప్రజలకు కేజ్రీ రేడియో మెసేజ్
న్యూఢిల్లీ: ‘‘విష రాజకీయ నాయకులకు'' దూరంగా ఉండాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సమీపంలోని ఓ గ్రామంలో మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పశుమాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన సంగతి తెలిసిందే.
దాద్రికి వెళ్లి అక్లఖ్ కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘‘విష రాజకీయ నేతలకు దూరంగా ఉండండి'' అని ఆయన దేశ ప్రజలకు ఓ రేడియో సందేశాన్ని పంపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశారు.

సదరు వీడియోను వీక్షించడంతో పాటు వీలయినంత మందికి దానిని షేర్ చెయ్యాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లో కేజ్రీవాల్ పెట్టిన వీడియోలో కేవలం ఓ కొవ్వొత్తి మాత్రమే కనిపిస్తున్నా, కేజ్రీవాల్ గొంతు మాత్రం దేశ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
ఈ తరహా హింసాత్మక ఘటనలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఇప్పటికే ఇద్దరు సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు తమ పురస్కారాలను తిరిగిచ్చేసిన సంగతి తెలిసిందే.
Do watch this msg and share it widely. An appeal to maintain communal harmony.https://t.co/cfws3s0kfw
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 7, 2015 ఈ ఘటనపై కేంద్రం నివేదిక కోరగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. అయితే నివేదికలో ఎక్కడా 'బీఫ్' అనే పదం వాడలేదు. నివేదికలో దాద్రి ఘటన అనంతరం గ్రామంలో పర్యటించిన పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా అందులో పేర్కొంది. దాద్రి ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల దాడిలో గాయపడ్డ అక్లఖ్ కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications