Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మార్చ్ 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం; ముహూర్తం ఫిక్స్ అయినట్టేనా!!

పంజాబ్ సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన భగవంత్ మాన్ ఇతర మంత్రులతో కలిసి మార్చ్ 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భగవంత్ మాన్ మార్చ్ 12, శనివారం గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలుస్తారు. తాజాగా ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. రాజీనామా పత్రాలను గవర్నర్ కు అందజేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్న భగవంత్ మాన్

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్న భగవంత్ మాన్

ఇక ఇదే సమయంలో ఎన్నికల విజయం తర్వాత భగవంత్ మాన్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి ప్రామాణ స్వీకార కార్యక్రమ కార్యాచరణపై చర్చించి కేజ్రీవాల్ ను ఆహ్వానించనున్నారు . తాము భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ప్రమాణం చేస్తామని, ఈ రోజు సాయంత్రంలోగా ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ తెలుస్తుందని అన్నారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 సీట్లు గెలుచుకుంది.

అమరవీరుల గ్రామాల్లో ప్రమాణ స్వీకార వేడుకలు: భగవంత్ మాన్

అమరవీరుల గ్రామాల్లో ప్రమాణ స్వీకార వేడుకలు: భగవంత్ మాన్


భగత్ సింగ్ ఇచ్చిన 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదంతో తన ర్యాలీలు ప్రారంభమై ముగిశాయని భగవంత్ మాన్ అన్నారు. తాను అందరికీ బహిరంగ ఆహ్వానం ఇస్తున్నానని, ఇంతకుముందు ప్రమాణ స్వీకారోత్సవాలు రాజభవనాలలో జరిగేవి. కానీ ఇప్పుడు ఈ వేడుకలు అమరవీరుల గ్రామాల్లో జరుగుతాయని భగవంత్ మాన్ వెల్లడించారు . మేము ఖట్కర్కలాన్‌లో ప్రమాణం చేస్తాం అని భగవంత్ మాన్ అన్నారు.

అమరుల త్యాగాల వల్లే స్వాతంత్ర్యం, అది గుర్తించటం నైతిక బాధ్యత

అమరుల త్యాగాల వల్లే స్వాతంత్ర్యం, అది గుర్తించటం నైతిక బాధ్యత

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో షాహిద్ భగత్ సింగ్ మరియు బిఆర్ అంబేద్కర్ యొక్క రెండు ఫోటోలు మాత్రమే ఉండాలని భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ నినాదం షాహిద్ ఇ ఆజం భగత్ సింగ్ ఆత్మకు సాంత్వన చేకూర్చాలి. మన అమరవీరులు చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తించడం మన నైతిక బాధ్యత. వారి వల్లే మనం స్వతంత్రులం అని భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్ ప్రజల తీర్పుతో పాటియాలా, మొహాలీ, (కెప్టెన్ అమరీందర్ సింగ్) మరియు మోరిండా, రూప్‌నగర్ (చరణ్‌జిత్ చన్నీ) నుండి రాజకీయ అధికార కేంద్రం ఇప్పుడు భగవంత్ మాన్ స్వస్థలమైన సంగ్రూర్‌కు మారింది.

 ప్రజల వద్దకే పాలన సాగిస్తాం : భగవంత్ మాన్

ప్రజల వద్దకే పాలన సాగిస్తాం : భగవంత్ మాన్

సామాన్య ప్రజల వద్దకే పాలన సాగిస్తామని, కేవలం నెల రోజుల్లోనే పంజాబ్ లో మార్పును చూడవచ్చు అని భగవంత్ మాన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను దక్కించుకుని విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ మూడు స్థానాలు, బిజెపి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+