సోమ, మంగళవారాల్లో భారత్ బంద్, బ్యాంకుల సమ్మె: సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం
న్యూఢిల్లీ: కార్మికులను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమ, మంగళవారాల్లో(మార్చి 28, 29) దేశవ్యాప్త బంద్‌కు కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది. బ్యాంకింగ్ రంగం సమ్మెలో పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫేస్‌బుక్‌లో తెలిపింది.
మార్చి 22, 2022న కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సమావేశం తర్వాత దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వివిధ రాష్ట్రాలలో సన్నాహాలను పరిశీలించిన తరువాత, యూనియన్లు కేంద్ర ప్రభుత్వ "కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు" వ్యతిరేకంగా రెండు రోజుల అఖిల భారత సమ్మెను ప్రకటించాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి.
మార్చి 28, 29 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. రిటైర్ కానున్న కార్మికులకు బ్యాంకుల వద్ద పెన్షన్‌లు ఉన్నాయని, వారు సమ్మెలో పాల్గొంటే ప్రభావితం కాదన్నారు.
బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి, బీమా వంటి వివిధ రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న సమ్మె ప్రభావం జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications