భారత్ బంద్ నేడే: వీటిపైనే ప్రభావం, రైతు నేతలతో కేంద్రం మూడో విడత చర్చలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'ఢిల్లీ చలో' ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. భారతీయ కిసాన్ పరిషత్ కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో దేశ వ్యాప్తంగా సమ్మె ప్రారంభం కానుంది. అదేరోజు పంజాబ్‌లో రాష్ట్ర, జాతీయ రహదారులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు.
మరోవైపు, రైతు నాయకుడు గురునామ్ సింగ్ తమ తర్వాతి మూడు రోజుల కార్యాచరణను వెల్లడించారు. శుక్రవారం రోజు మూడు గంటల పాటు టోల్ ఫ్రీ కార్యక్రమం నిర్వహిచడం, శనివారం ట్రాక్టర్ల ర్యాలీ, 18 తేదీన రైతు, కార్మిక సంఘల సంయుక్త సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. బంద్‌కు పిలుపు నేపథ్యంలో నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ప్రజలు ఒకేచోట గుమిగూడవద్దని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోయిడాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీలైనంత వరకు ప్రజలు మెట్రో ఉపయోగించుకోవాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు శుక్రవారం మూసివేసే అవకాశం ఉంది. వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పనులు, గ్రామీణ పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు కూడా మూసివేయబడతాయి. అయితే, పాఠశాలలు, విద్యా సంస్థలు, ఫార్మసీలు, ఎమర్జెన్సీ సేవలు శుక్రవారం యాథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి.
#WATCH | Union Ministers Piyush Goyal, Arjun Munda, Nityanand Rai and Punjab CM Bhagwant Mann hold a meeting with farmer leaders, in Chandigarh.
— ANI (@ANI) February 15, 2024
(Video: CM Bhagawant Mann PRO) pic.twitter.com/3mCx30DXbd
ఇది ఇలావుండగా, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు గురువారం రాత్రి సమావేశమయ్యారు. చండీగఢ్‌లో ఈ మేరకు మూడో విడత చర్చలు ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి విచ్చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నేత జగ్జీత్ సింగ్ ధల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ రైతుల తరఫున కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications