వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 వేల వాలంటీర్లకు ప్రయోగం.. మూడో దశలో భారత్ బయోటెక్, టార్గెట్ 300 మిలియన్ డోస్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న కోవాక్సిన్ మూడో దశ ప్రయోగం కోసం 13 వేల మంది వాలంటీర్లను తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రయోగం కోసం వచ్చిన 13 వేల మంది వాలంటీర్లను భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ధన్యవాదాలు తెలిపారు.

థర్డ్ ఫేజ్ ప్రయోగం నవంబర్‌లో ప్రారంభమయ్యింది. మొత్తం 26 వేల మంది వాలంటీర్లకు టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫస్ట్, సెకండ్ స్టేజీలో వెయ్యి అంశాలను పరిశీలించారు. వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యాన్ని ఫలితాలు చూపించాయి. భారత్ బయోటెక్ డెవల్ చేస్తోన్న కోవాక్సిన్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో రూపొందిస్తున్నారు. బయో సేప్టీ లెవల్-3 పేరుతో వ్యాక్సిన్‌ను కంపెనీ తీసుకొస్తోంది.

Bharat Biotech recruits 13,000 volunteers in Phase 3 trials

మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కోవాక్సిన్ భారీగానే ఉత్పత్తి చేస్తోంది. మిలియన్ల డోసుల ప్రొడక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. 1.4 బిలియన్ల డోసులు తయారీలో బిజీగా ఉన్నారు. అయితే భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా మాత్రం వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆందోళన నెలకొందని తెలిపారు. అయితే డోసుల ఉత్పత్తి లక్ష్యంపై అప్పుడప్పుడు భయాందోళన కలుగుతోందని చెప్పారు.

దేశంలో ఇప్పటికే 10 మిలియన్ల డోసులను ప్రొడ్యూస్ చేశారు. వచ్చే ఏడాదిలో 300 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 100 మిలియన్ల వ్యాక్సిన్ కొనుగోలు కోసం ప్రభుత్వం కూడా సంసిద్దంగా ఉంది.

English summary
Bharat Biotech that is currently in the testing phase for its coronavirus vaccine Covaxin has said that it has successfully recruited 13,000 volunteers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X