ఇక భారత్ జోడో యాత్ర పార్ట్ 2..!!

రాయ్ పూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ ముగిసింది. ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ లో నిర్వహించిన మూడు రోజుల ఈ ప్లీనరీలో- కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు. కీలక తీర్మానాలు చేశారు. చివరి రోజు- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలు చేశారు.

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని అంశాన్ని ప్రస్తావించారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందనీ డిమాండ్ చేశారు. చైనాతో అనుసరిస్తోన్న విధానాలపైనా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం గురించి మాట్లాడితే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సత్తా (అధికారం) గురించి మాట్లాడుతోందని విమర్శించారు.

Bharat Jodo Yatra

ఇదిలావుండగా- భారత్ జోడో యాత్ర విజయవంతమైన నేపథ్యంలో- దానికి రెండో భాగాన్ని కూడా చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద భారత్ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా కాశ్మీర్ చేరుకుంది.

ఈ భారత్ జోడో యాత్ర విజయవంతమైనట్లు కాంగ్రెస్ ప్లీనరీ తీర్మానించింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్న అనేక అంశాలు ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ ఎన్నికల అజెండాగా మార్చుకుంటామనీ చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు. దేశ ప్రజలు సఖ్యతతో మెలుగుతున్నప్పటికీ- కొన్ని మతతత్వ శక్తులు వారిని విడదీసే ప్రయత్నాలు చేస్తోన్నాయంటూ అభిప్రాయపడ్డారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉందనీ చెప్పారు.

భారత్ జోడో యాత్ర విజయవంతమైన నేపథ్యంలో- రెండో భాగాన్ని చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. భారత్ జోడో యాత్ర పార్ట్ 2 ప్రతిపాదనలు ప్రస్తుతం తమ పరిశీలనలో ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాల్సి ఉందని అన్నారు. భారత్ జోడో యాత్ర పార్ట్ 2 కోసం పార్టీ విస్తృతంగా చర్చించిందని, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+