రూ. 25 లక్షల విదేశీ నగదు సీజ్: మాఫియా డాన్ శిష్యుడా ?

అక్రమంగా విదేశీ నగదు దుబాయ్ దేశానికి తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని రెవెన్యూ శాఖ ఇంటలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫరూఖ్ (51) అనే వ్యక

బెంగళూరు: అక్రమంగా విదేశీ నగదు దుబాయ్ దేశానికి తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని రెవెన్యూ శాఖ ఇంటలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫరూఖ్ (51) అనే వ్యక్తిని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

మహమ్మద్ ఫరూఖ్ నుంచి రూ. 25.07 కోట్ల విలువైన విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. గరువారం మహమ్మద్ ఫరూఖ్ దుబాయ్ వెళ్లడానికి మంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లాడు.

Bhatkal man arrested with foreign currency in Mangaluru Airport

తనిఖీలు అన్నీ పూర్తి చేసిన తరువాత అతను దుబాయ్ వెళ్లే విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అతని లగేజ్ లు మళ్లీ పరిశీలించారు. అతని బ్యాగులో బిస్కెట్లు, ఇతర వస్తువులు ఉన్న చోట విదేశీ నగదు గుర్తించారు.

యూఎస్ డాలర్లు, బ్రిటీష్ పౌండ్లు, యూరోలు, యూఏఈ దినార్లు, సౌదీ అరేబియా రియాల్స్ తదితర దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న విదేశీ నగదు రూ. 25. 07 లక్షలు ఉంటుందని, మహమ్మద్ ఫరూఖ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇతనికి మాఫియా ముఠాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+